News March 27, 2024

చెర్రీకి తారక్ విషెస్

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా సోదరుడు రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది నీకు సంతోషం, విజయం కలగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. అటు సినీప్రముఖులు, అభిమానులు చెర్రీకి బర్త్‌డే విషెస్ చెబుతున్నారు.

Similar News

News March 14, 2026

వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్: తుమ్మల

image

TG: వరి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్‌లో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ క్రమంలో రైతులకు మెరుగైన ఆదాయం అందించేందుకు ఎగుమతులు, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్‌లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడేలా గ్రేడింగ్, ప్రాసెసింగ్, బ్రాండింగ్, నాణ్యతా ప్రమాణాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.

News March 14, 2026

మా డ్రెస్సింగ్‌తో మీకేంటి సమస్య: రాశీ ఖన్నా

image

కంఫర్ట్‌గా ఉండే దుస్తులు ధరించే స్వేచ్ఛ ఏ అమ్మాయికైనా ఉంటుందని హీరోయిన్ రాశీ ఖన్నా అన్నారు. ‘ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది అమ్మాయి ఇష్టం. మేము ఏ దుస్తులు ధరిస్తే మీకేంటి సమస్య’ అని ప్రశ్నించారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్లలో ఆమె పాల్గొన్నారు. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై <<18746820>>చర్చ జరగడాన్ని<<>> ప్రస్తావించగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని, పెళ్లికి ఇప్పుడు సమయం లేదని చెప్పారు.

News March 13, 2026

యుద్ధం.. ఐదుగురు భారతీయులు మృతి

image

ఒమన్‌లోని సోహార్ పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేసిన డ్రోన్ శకలాలు పడటంతో ఇద్దరు భారతీయులు మృతిచెందినట్లు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ ఘటనలో మరో 10 మంది భారతీయులు గాయపడ్డారు. మరోవైపు హార్ముజ్‌లో చిక్కుకుపోయిన నౌకల్లో ఉన్న భారత నావికుల్లో ముగ్గురు చనిపోయినట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఐదుగురు ఇండియన్స్ ప్రాణాలు విడిచినట్లు అయ్యింది.