News April 12, 2025

విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ హల్‌చల్

image

ప్రకాశ్ నగర్ సమీపంలోని శాంతినగర్ వద్ద శనివారం బ్లేడ్ బ్యాచ్ దాడి చేయడంతో ఆకుల గణేశ్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. డబ్బులు అడుగగా గణేశ్ లేవని చెప్పడంతో దుండుగులు అతడిపై బ్లేడుతో, పక్కనున్న వారిపై కర్రలతో దాడి చేశారు. గాయాలతో పడి ఉన్న గణేశ్‌ను 108 వాహనంలో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 30, 2025

రాజన్న కోడెలను రక్షించుకుందాం: ఇంఛార్జ్ కలెక్టర్

image

ప్లాస్టిక్ వినియోగం తగ్గించి రాజన్న కోడెలను రక్షించుకుందామని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. జాతర సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగంతో కోడెల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, స్థానిక వ్యాపారులు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు సహకరించాలని కోరారు. సంబంధిత అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి ప్లాస్టిక్ విక్రయాన్ని అరికట్టాలన్నారు.

News December 30, 2025

అందరికీ AI: ప్రభుత్వం సరికొత్త ప్లాన్!

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేవలం కొందరికే పరిమితం కాకుండా, సామాన్యులకూ అందుబాటులోకి రావాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ‘AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’పై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. నగరాలకే పరిమితం కాకుండా గ్రామాల్లోని వారూ లోకల్ భాషల్లో AI టూల్స్ తయారు చేసుకునేలా.. కంప్యూటింగ్ పవర్, డేటాను అందరికీ షేర్ చేయడమే ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం.

News December 30, 2025

KNR: ‘మహా శివరాత్రి జాతరకు పటిష్ఠ బందోబస్తు’

image

ఫిబ్రవరి 14, 15, 16వ తేదీలో వేములవాడలో జరుగనున్న మహా శివరాత్రి జాతరకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. జాతర సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతర సందర్భంగా 8 మంది డీఎస్పీలు, 38 మంది సీఐలు, 119 మంది ఎస్సైలు, 158 ఏఎస్సైలు, 388 కానిస్టేబుళ్లు, హోమ్ గార్డ్స్‌తో కలిపి మొత్తం 1300 మందికి పైగా పోలీసులు మూడు రోజులు బందోబస్తు నిర్వహిస్తారని వెల్లడించారు.