News April 12, 2025
ఇంటర్ రిజల్ట్స్.. సత్తా చాటిన ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు

రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించి ఫస్టియర్‌లో గుంటూరు జిల్లా 58 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 76% ఉత్తీర్ణతతో జిల్లా విద్యార్థులు 2వ స్థానంలో నిలవడం విశేషం. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు సాధించిన ఈ విజయాన్ని అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.
Similar News
News April 14, 2025
గుంటూరులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం రద్దు: ఎస్పీ

నేడు డా.B.R.అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం గుంటూరులో ఆయన మాట్లాడారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అర్జీలు ఇవ్వాలనుకున్న ప్రజలు గమనించవలసిందిగా కోరారు.
News April 13, 2025
గుంటూరులో గ్రీవెన్స్ డే రద్దు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని గుంటూరు కలెక్టరేట్లో రేపు(సోమవారం) జరిగే గ్రీవెన్స్ డేని రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి ప్రకటన విడుదల చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉన్నందున గ్రీవెన్స్‌ను డే రద్దు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
News April 13, 2025
రూ.300 కోట్లతో రిటైనింగ్ వాల్: మంత్రి లోకేశ్

మహానాడు ప్రాంతంలో వరద ముంపు నివారణకు రూ.300 కోట్లతో రిటైనింగ్ వాల్ మంజూరైందని, పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరి రూరల్ యర్రబాలెంలోని మన ఇల్లు-మన లోకేశ్ కార్యక్రమంలో భాగంగా 5వరోజు మహానాడు కాలనీవాసులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిటైనింగ్ వాల్ నిర్మాణంపై ఆయన మాట్లాడారు. మంగళగిరిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు.