News April 12, 2025
విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ హల్‌చల్

ప్రకాశ్ నగర్ సమీపంలోని శాంతినగర్ వద్ద శనివారం బ్లేడ్ బ్యాచ్ దాడి చేయడంతో ఆకుల గణేశ్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. డబ్బులు అడుగగా గణేశ్ లేవని చెప్పడంతో దుండుగులు అతడిపై బ్లేడుతో, పక్కనున్న వారిపై కర్రలతో దాడి చేశారు. గాయాలతో పడి ఉన్న గణేశ్‌ను 108 వాహనంలో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 24, 2026
కృష్ణా: రెవెన్యూ క్లినిక్ అర్జీలపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌లో వస్తున్న అర్జీల పరిష్కార చర్యలపై కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న 430 అర్జీలను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 804 అర్జీలు అందగా 106 అర్జీలను పరిష్కరించినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. 207 అర్జీలను రిజక్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సమీక్షలో జేసీ నవీన్ ఉన్నారు.
News March 24, 2026
వెనుకబడిన విద్యార్థుల్లో ప్రమాణాలు పెంచాలి: కలెక్టర్

ప్రాథమిక పాఠశాలల్లో చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ విద్యా వాలంటీర్లను ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు ఆఫీస్ నుంచి విద్యాశాఖ అధికారులు, గ్రామాల్లో గుర్తించిన వాలంటీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలలో కొంతమంది విద్యార్థులు చదువులో వెనకబడుతున్నారన్న విషయం ఉపాధ్యాయులు సరిగ్గా గమనించడం లేదన్నారు.
News March 24, 2026
బాలల సంక్షేమం కోసం చర్యలు తప్పవు: కలెక్టర్

బాలల సంక్షేమం, సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. బాల్యవివాహాలు, పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు పోక్సో, జువెనైల్ జస్టిస్ చట్టాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సమాచారం అందగానే అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఆధార్ లేని అనాధ పిల్లలకు తక్షణమే కార్డులు మంజూరు చేయాలని సూచించారు.


