News April 12, 2025

సళేశ్వరం జాతరలో పోలీసులకు సహకరించాలి: అచ్చంపేట డీఎస్పీ 

image

అమ్రాబాద్ నల్లమల్ల ప్రాంతంలోని అటవీ ప్రాంతంలోని శ్రీ సళేశ్వరం లింగమయ్య స్వామి జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులు పోలీసు అధికారులకు సహకరించాలని అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ కోరారు. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో భక్తులు వేలాదిగా తరలిరానున్నారన్నారు. భక్తులు స్వామివారి దర్శనం అనంతరం అక్కడ సేద తీరకుండా ఇతర భక్తులకు అవకాశం కల్పించేందుకు వెంటనే తిరుగు ప్రయాణం కావాలని సూచించారు.

Similar News

News September 15, 2025

మరో వివాదంలో పూజా ఖేడ్కర్

image

మహారాష్ట్రకు చెందిన మాజీ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ ట్రక్ డ్రైవర్ కిడ్నాప్ విషయంలో ఆమె పేరు బయటికి వచ్చింది. ముంబైలోని ఐరోలిలో డ్రైవర్ ప్రహ్లాద్ కుమార్ తన ట్రక్‌తో ఓ కారును ఢీకొట్టారు. దీంతో కారులోని ఇద్దరు వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేశారు. పోలీసులు లొకేషన్ ట్రేస్ చేయగా పుణేలోని పూజా ఇంటిలో చూపించింది. డ్రైవర్‌ను విడిపిస్తున్న క్రమంలో పూజా తల్లి మనోరమ హంగామా చేశారు.

News September 15, 2025

KNR: యూరియా బ్లాక్‌లో అమ్ముతున్నా చర్యలేవి..?

image

రాష్ట్రంలో యూరియా కొరతకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని MP బండి సంజయ్ అన్నారు. సరైన ప్లాన్ లేకపోవడం, యూరియాను బ్లాక్‌లో అమ్ముతున్నా చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందన్నారు. రబీ సీజన్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం పంపితే, 2.05 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మిగిలిందని, దాన్ని ఏం చేశారో కూడా లెక్కా పత్రం లేదన్నారు. వందే భారత్ ప్రారంభోత్సవం వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

News September 15, 2025

సీఎం కాన్ఫరెన్స్‌కు హాజరైన కాకినాడ కలెక్టర్

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నుంచి నిర్వహిస్తున్న రెండు రోజుల కలెక్టర్ల సమావేశానికి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత జిల్లాకు సంబంధించిన అంశాలపై ఆయన చర్చిస్తారని అధికారులు తెలిపారు. జిల్లా సమస్యలపై సమగ్ర సమాచారాన్ని కలెక్టర్ తీసుకెళ్లారని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురానున్నారని సమాచారం.