News March 27, 2024

ధోనీ అందుకే బ్యాటింగ్‌కు రాలేదు: హస్సీ

image

IPL-2024లో ఇప్పటివరకు CSK ఆడిన 2 మ్యాచుల్లో ధోనీ బ్యాటింగ్‌కు రాలేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆయన ఒక్క బాల్ కూడా ఆడలేదు. దీనిపై బ్యాటింగ్ కోచ్ హస్సీ స్పందిస్తూ ‘ఇంపాక్ట్ రూల్ వల్ల బ్యాటింగ్ ఆర్డర్ లెంగ్త్ ఎక్కువైంది. అందుకే ధోనీ 8వ స్థానంలో రావాల్సి వస్తోంది. మరోవైపు ఫాస్ట్‌గా ఆడాలని బ్యాటర్లకు హెడ్ కోచ్ ఫ్లెమింగ్ సూచించారు. అందుకే ధోనీ బ్యాటింగ్‌కు రాలేదు. ఆయన మంచి ఫామ్‌లో ఉన్నారు’ అని వివరించారు.

Similar News

News January 26, 2026

ఖమ్మం: పొత్తుల చిక్కుముడి.. పొంగులేటి వర్సెస్ సీపీఐ

image

ఉమ్మడి జిల్లా మున్సిపల్ ఎన్నికల రాజకీయం మంత్రి పొంగులేటి వ్యూహాలతో సెగలు పుట్టిస్తోంది. ఏదులాపురం, కొత్తగూడెంలో మెజార్టీ స్థానాలను దక్కించుకుని తన ఆధిపత్యాన్ని చాటాలని మంత్రి స్కెచ్ వేస్తున్నారు. కానీ ఇది మిత్రపక్షమైన CPIకి ఇబ్బందిగా మారింది. ఈ స్థానాల్లో ఎక్కువ సీట్లు కేటాయించాలని సీపీఐ నేతలు పట్టుబడుతున్నారు. మంత్రి మాత్రం పట్టు వీడకపోవడంతో పొత్తులు కుదురుతాయా లేదా అన్న సందిగ్ధత నెలకొంది.

News January 26, 2026

వేసవి ఉల్లి సాగుకు సూచనలు

image

వేసవి పంట కోసం ఉల్లిని సాగు చేయాలనుకుంటే ఈ నెలలోనే సిద్ధమవ్వాలి. పంట కొరకు ముందుగా నారును పెంచుకోవాలి. నారుమడి కోసం నేలను దున్ని 4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 15 సెంటీ మీటర్ల ఎత్తు గల 10 మళ్లను తయారు చేసుకోవాలి. ఒక కిలో విత్తనానికి కాప్టాన్ లేదా థైరమ్‌ను 3గ్రా. లేదా ట్రైకోడెర్మావిరిడె 4 గ్రాములు పట్టించి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.

News January 26, 2026

భారతీయత ఉట్టిపడేలా ఉర్సులా జాకెట్

image

భారత సంప్రదాయం ఉట్టిపడేలా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా ప్యాంటుసూట్స్‌లో కనిపించే ఆమె తాజాగా బనారసీ జాకెట్‌ను ధరించారు. గోల్డ్, మెరూన్ రంగులో ఉన్న ఈ దుస్తులు ఆకట్టుకుంటున్నాయి. 77వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఉర్సులా హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తన జీవితంలో లభించిన అతిపెద్ద గౌరవం అని ట్వీట్ చేశారు.