News April 12, 2025
MHBD: ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గందరగోళం

ప్రభుత్వం పేదలకు ఇవ్వనున్న ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పలు గ్రామాల్లో గందరగోళం నెలకొంది. అధికార కాంగ్రెస్ నాయకులు కమిటీలుగా ఏర్పడి అర్హుల జాబితాను దాదాపు సిద్ధం చేశారు. కాగా, కొన్ని లిస్టులు లీక్ అవ్వగా అందులో తమ పేరు లేదని తెలుసుకున్న కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిటీ సభ్యులకు కావాల్సిన వారికి ఇళ్లు ఇవ్వాలని చూస్తున్నారని వాట్సప్ వేదికగా ఆరోపిస్తున్నారు.
Similar News
News November 16, 2025
వనపర్తి: వృద్ధుల సంరక్షణ చట్టాలపై అవగాహన సదస్సు

వయోవృద్ధుల సంరక్షణ చట్టం-2007 ప్రకారం వృద్ధులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా, ఫిర్యాదు చేసిన తక్షణమే తగిన న్యాయం చేస్తామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి తెలిపారు. సోమవారం వనపర్తి ఆర్డీఓ కార్యాలయంలో వయోవృద్ధుల సంరక్షణ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు.
News November 16, 2025
మన్యం జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షునిగా సంజీవరావు

పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది. ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా కార్యదర్శి జివిఆర్ కిషోర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా కే.సంజీవరావు, జనరల్ సెక్రటరీగా జి.చంద్రమౌళి, వైస్ ప్రెసిడెంట్‌గా డబ్ల్యూవిఎస్‌ఎస్ శర్మ, ట్రెజరీగా వి.మౌనిక, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డి.కళ్యాణిదుర్గ ఎన్నికయ్యారు.
News November 16, 2025
టెట్ ఫలితాల విడుదల అప్పుడే: విద్యాశాఖ

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) దరఖాస్తుల ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 03 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 10-16వ తేదీ మధ్య వెల్లడిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థులు కూడా జనరల్ కోటా మాదిరిగానే మార్కులు సాధించాల్సి ఉంటుందని పేర్కొంది.


