News April 12, 2025
చిట్వేలు: ఆ కాలేజీలో ఒక్కరే పాస్

చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఒకే విద్యార్థిని ఆనందల మల్లిక ఉత్తీర్ణులయ్యారు. 474 మార్కులకు గానూ 294 మార్కులు సాధించారు. 78 మంది పరీక్షలు రాస్తే 77 మంది ఫెయిలయ్యారు. చిట్వేలులో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేశారు కానీ లెక్చరర్లు, ప్రిన్సిపల్ లేకుండానే సంవత్సరం పూర్తి అయిపోయింది. అధికారులు లెక్చరర్లను నియమించాల్సి ఉంది.
Similar News
News July 4, 2025
నిర్మల్ పోలీసుల రికార్డ్.. 21 రోజుల్లో 76 ఫోన్లు రికవరీ

నిర్మల్ జిల్లా పోలీసులు రికార్డ్ సృష్టించారు. 21 రోజుల్లో పోగొట్టుకున్న 76 మొబైల్ ఫోన్లను ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సుమారు రూ.9.12 లక్షల విలువైన ఈ ఫోన్లను రికవరీ చేశామని, గతంతో పోలిస్తే రికవరీ శాతం గణనీయంగా పెరిగిందని ఎస్పీ తెలిపారు. మొబైల్ పోయినా, చోరీకి గురైనా ప్రజలు www.ceir.gov.in పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
News July 4, 2025
ములుగు: తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్టుల రిక్వెస్ట్!

సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. పాకిస్థాన్‌తో శాంతి చర్చలు జరుపుతాము కానీ, మావోయిస్టులతో చర్చలు జరపం అనే మోదీ ప్రభుత్వ వైఖరిని ఖండించండని ఆ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టులు నేటి వరకు 40 వేల మంది ఆదివాసులను హతమార్చారని అమిత్ షా అబద్దపు ప్రకటన చేశారన్నారు. రాష్ట్రంలో కూడా కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
News July 4, 2025
AI ద్వారా భూ సమస్యల పరిష్కారం: మంత్రి అనగాని

AP: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూములను ఆధార్, సర్వే నంబర్లతో లింక్ చేస్తామని చెప్పారు. ‘రైతులకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నాం. గ్రీవెన్స్ ద్వారా ఇప్పటివరకు 4.63 లక్షల ఫిర్యాదులు రాగా 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించాం. త్వరలోనే మిగతా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.