News April 12, 2025

నర్సాపూర్: కన్న తండ్రిపై కత్తితో దాడి చేసిన కొడుకు

image

నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వడ్ల దశరథంపై సొంత కుమారుడు వడ్ల నాగరాజు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ దశరథ్‌ను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దశరథం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భూమి పంచి ఇవ్వడం లేదంటూ తండ్రిపై నాగరాజు దాడి చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

Similar News

News March 27, 2026

ఇంధన కొరతపై వదంతులు నమ్మొద్దు: కలెక్టర్

image

గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు నమ్మవద్దని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లాలో సరఫరా సమృద్ధిగా ఉందని, బుకింగ్ చేసిన వారికి 100% డెలివరీ జరుగుతోందన్నారు. అవసరానికి మించి నిల్వలు వద్దని సూచించారు. అక్రమ వినియోగంపై తనిఖీలు నిర్వహించి 134 సిలిండర్లు సీజ్ చేసి 23 మందిపై కేసులు నమోదు చేశారు. అధికారిక సమాచారాన్నే నమ్మాలని, సమస్యల కోసం 9391942254 సంప్రదించాలని సూచించారు.

News March 27, 2026

మెదక్: లైంగిక దాడి.. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

image

తూప్రాన్ మండలంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ మెదక్ న్యాయమూర్తి శుభావల్లి తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. తూప్రాన్ మండలం జెండాపల్లి గ్రామానికి చెందిన సోమగారి భాస్కర్ (27) బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు వివరించారు.

News March 26, 2026

మెదక్: హెల్మెట్, సీటుబెల్టు తప్పనిసరి: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అత్యంత కీలకమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మెదక్ టౌన్‌లోని బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో ‘Arrive Alive’ మూడో విడత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, యువతకు రోడ్డు భద్రతపై సూచనలు అందించారు. వాహనదారులు హెల్మెట్, సీటుబెల్టు ఉపయోగించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకపోవడం, అధిక వేగం, సెల్‌ఫోన్ ఉపయోగం గురించి వివరించారు.