News April 12, 2025

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో పొన్నూరు అమ్మాయి ప్రతిభ

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో పొన్నూరుకు చెందిన విద్యార్థిని సత్తా చాటుకుంది. నాదెండ్ల కృష్ణ ప్రియ అనే విద్యార్థిని ఇంటర్ ఫస్ట్ ఈయర్‌లో 467 మార్కలు సాధించింది. ఆమె ఫాదర్ గవర్నమెంట్‌ టీచర్‌గా పని చేస్తున్నారు. మంచి మార్కులు రావడంపై తల్లిదండ్రులు, అధ్యాపకులు కృష్ణ ప్రియను అభినందిస్తున్నారు.

Similar News

News April 13, 2025

గుంటూరులో గ్రీవెన్స్ డే రద్దు

image

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్క‌ర్ జయంతిని పురస్కరించుకొని గుంటూరు కలెక్టరేట్లో రేపు(సోమవారం) జరిగే గ్రీవెన్స్ డేని రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి ప్రకటన విడుదల చేశారు. అంబేడ్క‌ర్ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉన్నందున గ్రీవెన్స్‌ను డే రద్దు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News April 13, 2025

రూ.300 కోట్లతో రిటైనింగ్ వాల్: మంత్రి లోకేశ్

image

మహానాడు ప్రాంతంలో వరద ముంపు నివారణకు రూ.300 కోట్లతో రిటైనింగ్ వాల్ మంజూరైందని, పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరి రూరల్ యర్రబాలెంలోని మన ఇల్లు-మన లోకేశ్ కార్యక్రమంలో భాగంగా 5వరోజు మహానాడు కాలనీవాసులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిటైనింగ్ వాల్ నిర్మాణంపై ఆయన మాట్లాడారు. మంగళగిరిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు.

News April 13, 2025

ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ అద్భుత విజయం

image

ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అద్భుత విజయం సాధించారని అడ్మిన్ అడ్వైజర్ సీఏ మట్టుపల్లి మోహన్ తెలిపారు. MECలో లిఖిత, గీతిక, హరిణి 494/500 మార్కులు సాధించారు. 490కి పైగా 88 మంది, 480 ఆపైన 498 మంది, 649 మందికి 475 ఆపైన మార్కులు వచ్చాయి. సీనియర్ ఇంటర్లో సాత్విక 982 మార్కులు, 970 ఆపైన 71 మంది, 141 మంది 960 ఆపైగా మార్కులు సాధించారని పేర్కొన్నారు. విద్యార్థులను యాజమాన్యం అభినందించింది.

error: Content is protected !!