News April 12, 2025
చింతలమానేపల్లిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు

చింతలమానేపల్లిలోని కర్జవెల్లిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ యువజన సంఘం తెలంగాణ రాష్ట్రం పేరుతో పోస్టర్లు వెలిశాయి. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల కాంపౌండ్ వాల్‌తో పాటు పలు చోట్లు పోస్టర్లు అంటించారు. ‘ఆదివాసీల మీద మావోయిస్టులు అప్రకటిత యుద్ధం..!, కర్రె గుట్టలో మందు పాత్రలు.. మావోయిస్టులారా తీరవా మీ రక్త దాహాలు, అడవుల్లో బాంబులు.. ఆదివాసుల గుండెల్లో గుబులు’ అంటూ పోస్టర్లలో రాసి ఉంది.
Similar News
News November 3, 2025
హైదరాబాద్‌లో వర్షం షురూ..

TG: హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బాలానగర్, గచ్చిబౌలి, మల్కాజ్‌గిరి, కాప్రాలో వర్షం పడుతోంది. రాబోయే 2 గంటల్లో అమీర్‌పేట్, హిమాయత్‌నగర్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, ఓయూ, చార్మినార్, నాంపల్లిలోనూ వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
News November 3, 2025
HYD: బస్సు ప్రమాదంపై KCR, KTR దిగ్భ్రాంతి

మీర్జాగూడ ప్రమాద ఘటనపై మాజీ CM KCR, మాజీ మంత్రి KTR తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోవడం అత్యంత బాధకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి సూచించారు.
News November 3, 2025
స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించగా తమ అభిప్రాయం తెలిపేందుకు గడువు కోరింది. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది.


