News April 12, 2025
కొత్తగూడెం: ‘యువ వికాసం అప్లికేషన్లు అందజేయండి’

జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయాల్లో నేటి నుంచి 3 రోజులు వరకు రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్ పత్రాలు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తులు స్వీకరించే అధికారులు, సిబ్బంది రెండో శనివారం, ఆదివారం, సోమవారం అందుబాటులో ఉంటారని తెలిపారు. కాగా సాంకేతిక కారణాల వల్ల చాలామంది దరఖాస్తు చేసుకోలేదని మరికొంత సమయం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News January 14, 2026
భద్రాద్రి: పండుగ వేళ విషాదం.. బస్సు ఢీకొని మహిళ మృతి

చండ్రుగొండ మండల కేంద్రంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి దాటుతున్న ఓ మహిళను భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సంక్రాంతి సంబరాల్లో ఉండాల్సిన కుటుంబంలో ఈ ఘటనతో పెను విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 14, 2026
ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్‌గా అంజలి శార్వాణి

ఆదోనికి చెందిన క్రికెటర్ అంజలి శార్వాణి ఆంధ్ర మహిళా సీనియర్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఫిబ్రవరి నుంచి జరిగే వన్డే టోర్నీ కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆమెను సారథిగా ప్రకటించింది. గతంలో భారత జట్టు తరఫున ఆడిన ఆమె, మోకాలి గాయం నుంచి కోలుకుని తిరిగి మైదానంలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవలే సర్జరీ పూర్తి చేసుకున్న అంజలి, మైసూర్ సెలక్షన్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి తన ఫిట్‌నెస్‌ను చాటుకున్నారు.
News January 14, 2026
గంగిరెద్దుల విన్యాసాలు – పల్లెటూరి సందడి

సంక్రాంతి వేళ పల్లె వాకిళ్లలో గంగిరెద్దుల సందడి ఉంటుంది. చక్కగా అలంకరించిన ఎద్దును ఇంటింటికీ తిప్పుతూ, డోలు సన్నాయి వాయిద్యాల మధ్య విన్యాసాలు చేయిస్తారు. ‘అయ్యగారికి, అమ్మవారికి దండం పెట్టు’ అనగానే ఆ ఎద్దు తల ఊపుతూ అభినయించడం ముచ్చటగా ఉంటుంది. శివుని వాహనమైన నందిగా భావించి, ప్రజలు వీటికి పాత బట్టలు, ధాన్యం దానం చేస్తారు. గంగిరెద్దులు ఇంటికి రావడం లక్ష్మీప్రదమని, పశుసంపద వృద్ధి చెందుతుందని నమ్మకం.


