News April 12, 2025
ఈ నెల 14న అంబేద్కర్ జయంతి వేడుకలు

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా. బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఈ నెల 14న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. ఈ ఉత్సవాలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల వెనుకబడిన తరగతుల నాయకులు, కార్మికులు హాజరుకావాలని ఆమె కోరారు.
Similar News
News February 28, 2026
ఉచిత రేషన్.. కేంద్రం కీలక నిర్ణయం

ఉచిత రేషన్ కింద ఇచ్చే బియ్యాన్ని ఫోర్టిఫికేషన్ చేసే ప్రాసెస్‌ను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. బియ్యాన్ని ఎక్కువ కాలం స్టోర్ చేసినప్పుడు అందులోని పోషక విలువలు తగ్గిపోతున్నట్లు IIT ఖరగ్‌పూర్ స్టడీలో తేలడమే దీనికి కారణం. మరింత మెరుగైన పద్ధతిలో పోషకాలను అందించే విధానాన్ని గుర్తించే వరకు ఈ ప్రాసెస్‌ను ఆపాలని నిర్ణయించారు. అయితే రేషన్ కోటాలో మాత్రం ఎలాంటి తగ్గింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.
News February 28, 2026
కివీస్ ఓటమి.. పాక్‌కు దక్కిన లైఫ్ లైన్!

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో న్యూజిలాండ్ తన సెమీఫైనల్ బెర్తును ప్రమాదంలో పడేసుకుంది. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఎటువంటి లెక్కలతో పని లేకుండా నేరుగా సెమీస్‌కు వెళ్లేవాళ్లమని, మా పని సులువు అయ్యేదని కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాటింగ్‌లో విఫలమయ్యామని అంగీకరించారు. కివీస్ ఓటమి పాక్‌కు కలిసొచ్చింది. నేడు శ్రీలంకపై భారీ తేడాతో గెలిస్తే సెమీస్‌లోకి దూసుకెళ్లే ఛాన్స్ ఉంది.
News February 28, 2026
సంగారెడ్డి: జాతీయ చేనేత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

సంగారెడ్డి జిల్లాలో జాతీయ చేనేత అవార్డులకు అర్హులైన వారు మార్చి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చేనేత శాఖ సహాయ సంచాలకులు వెంకటరావు తెలిపారు. దరఖాస్తుదారులు తాము స్వయంగా మగ్గంపై రూపొందించిన కొత్త డిజైన్లను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఎక్కడా లేని వినూత్న డిజైన్లకు ప్రాధాన్యత ఉంటుందని, వివరాలకు స్థానిక చేనేత కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.


