News April 12, 2025
ఉదయం 6 నుంచే పనిచేయండి: నారాయణ

మంత్రి నారాయణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లను ఉదయం 6 గంటలకే నిద్ర లేపుతున్నారు. అమరావతి నుంచి శనివారం ఉదయం 6 గంటలకు కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెల్లవారుజామున పట్టణాల్లో పర్యటించాలని ఆదేశించారు. తానూ ఏదో ఒక మున్సిపాల్టీలో ఉదయం 6 గంటలకు పర్యటిస్తానని చెప్పారు.
Similar News
News January 11, 2026
నెల్లూరు: 20 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

నెల్లూరు జిల్లాలో వాయుగుండం ప్రభావంతో చలి తీవ్రత పెరిగింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండగా, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. సముద్రం సుమారు 20 మీటర్ల వరకు ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు 5 రోజుల పాటు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర గ్రామాల్లో అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
News January 11, 2026
రాష్ట్రంలో నెల్లూరుకు మొదటి స్థానం

జిల్లా మ్యూజియంకు రాష్ట్రంలో మొదటి స్థానం దక్కిన్నట్లు మ్యూజియం ఇన్‌ఛార్జ్ శివారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 5 జిల్లా సైన్స్ మ్యూజియం కేంద్రాలు ఉండగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ నుంచి డిసెంబర్ వరకు సైన్స్ మ్యూజియం చూసేందుకు వచ్చిన సందర్శకుల వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు – 10 వేలు, కడప – 854, ఏలూరు – 3,540, చిత్తూరు – 4,000, అనంతపురం – 5,636 మంది సందర్శించారు.
News January 11, 2026
నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి ఖైదీ పరార్

నెల్లూరు సెంటర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ పరారయ్యాడు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు గ్రామానికి చెందిన షేక్ చిన్న సైదులు 2022 సంవత్సరంలో తన భార్యను హత్య చేసి శిక్షను అనుభవిస్తున్నాడు. రెండు సంవత్సరాలు రాజమండ్రి జైలులో శిక్షణ అనుభవించి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఖైదీ సైదులు సత్ప్రవర్తన కింద ఓపెన్ జైలుకు తరలించారు. వ్యవసాయ పనులు చేస్తూ పరారయ్యాడు.


