News April 12, 2025

NTR: ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ప్రతిభ

image

రాష్ట్ర వ్యాప్తంగా నేడు విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో గంపలగూడెంలోని ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థిని అపరంజి ఉత్తమ మార్కులు సాధించింది. మొదటి సంవత్సరం ఎంపీసీలో 470కి 452 మార్కులతో గంపలగూడెం మండలంలోని ప్రభుత్వ కళాశాలల్లో మొదటి స్థానంలో నిలిచింది. అపరంజి ఉత్తమ ఫలితాలు సాధించడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. 

Similar News

News March 14, 2026

కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 91% మంది విద్యార్థులు హాజరు.!

image

కడప జిల్లాలో శనివారం 62 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ సివిక్స్ పేపర్-1 పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 91% మంది విద్యార్థులు హాజరయ్యారు. నేడు 3,723 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 3,397 మంది మాత్రమే హాజరయ్యారు. 326 మంది విద్యార్థులు పరీక్షలకు డుమ్మా కొట్టారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ అధికారులు తెలిపారు.

News March 14, 2026

FLASH.. కేయూ మాజీ వైస్ ఛాన్స్‌లర్ లింగమూర్తి మృతి

image

కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ లింగమూర్తి ఈరోజు మధ్యాహ్నం 12:20 గం.కు మృతి చెందారు. ఆయనకు భార్య అంజలి, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. గత ఆరు మాసాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు నెలలుగా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం క్షీణించడంతో వారం రోజుల క్రితం ఆయన నివాసానికి తీసుకురాగా ఈరోజు తుది శ్వాస విడిచారు.

News March 14, 2026

పెద్దపల్లి: యువతకు మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ప్రారంభం

image

పెద్దపల్లి జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెడికల్ కోడింగ్ & బిల్లింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఈ శిక్షణ మార్చి 16 నుంచి పెద్దపల్లి TASK రీజినల్ సెంటర్‌లో ప్రారంభం కానుందని, ఫార్మసీ, బయోటెక్నాలజీ విద్యార్థులు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.