News April 12, 2025
బెంగాల్‌లో అల్లర్లు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

వక్ఫ్ చట్టం సవరించిన నేపథ్యంలో బెంగాల్‌లో కొద్ది రోజులుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ ‘చట్టాన్ని సవరించింది కేంద్ర ప్రభుత్వం. మేం కాదు. మీరు కేంద్రంతోనే తేల్చుకోండి. సవరించిన వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ఇప్పటికే చెప్పాం. కాబట్టి అన్ని మతాల ప్రజలు శాంతించండి’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈ అల్లర్లలో ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారు.
Similar News
News March 27, 2026
ఒట్రోవర్ట్స్ గురించి తెలుసా?

మనుషుల్లో ఇన్‌ట్రోవర్ట్స్, ఎక్స్‌ట్రోవర్ట్సే కాకుండా ఒట్రోవర్ట్స్ కూడా ఉంటారని US సైకియాట్రిస్ట్ రమీ కమిన్స్కీ చెబుతున్నారు. ‘అందరితో కలిసిపోయినట్లు కనిపిస్తారు. గ్రూపుల్లో యాక్టివ్‌గా, మిగతావారితో కలివిడిగా ఉంటారు. కానీ లోపల మాత్రం వారి అనుభవం వేరుగా ఉంటుంది. తమ నిజమైన స్వభావానికి ప్రాధాన్యం ఇస్తారు. భావోద్వేగాల పరంగా స్వతంత్రంగా ఉంటారు’ అని కమిన్స్కీ వివరించారు. మరి మీరూ ఒట్రోవర్టా?
News March 27, 2026
వెంకీ-కళ్యాణ్ రామ్ మూవీ.. మళ్లీ అదే కాంబినేషన్

వెంకీ-కళ్యాణ్ రామ్‌తో అనిల్ రావిపూడి తీస్తున్న కొత్త మూవీకి సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు హీరోలతో ఉన్న ఫొటోలను అనిల్ రిలీజ్ చేశారు. అలాగే సురేశ్ ప్రొడక్షన్స్, Z స్టూడియోస్ భాగం కానున్నట్లు తెలిపారు. ఈ మూవీలో కీర్తీ సురేశ్, కృతి శెట్టి నటిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నా మూవీ టీమ్ ప్రకటించలేదు. ఇక సాహు-అనిల్ కాంబోలో భగవంత్ కేసరి, MSVPG మూవీలు వచ్చిన విషయం తెలిసిందే.
News March 27, 2026
ఎండలు.. శరీరానికి డబుల్ షాక్!

సమ్మర్‌లో ఉద్యోగులపై డబుల్ ఎఫెక్ట్ పడుతుందని హెల్త్ ఎక్స్‌పర్టులు చెబుతున్నారు. ‘మధ్యాహ్నం బయటికెళ్తే హీట్ ఎక్కువ వస్తుంది. అక్కడి నుంచి ఆఫీసులోకొస్తే చాలా కూల్‌గా ఉంటుంది. ఈ సడెన్ మార్పులతో తలనొప్పి, కళ్లలో మంట, చర్మం పొడిబారడం వంటివి కనిపిస్తాయి. BP పెరగొచ్చు. అందుకే ఎండ నుంచి నేరుగా చల్లటి చోటుకు వెళ్లొద్దు. AC 24–26°C ఉండాలి. దాని ఎదురుగా కూర్చోవద్దు. నీరు ఎక్కువ తాగాలి’ అని అంటున్నారు.


