News April 12, 2025
సోనియా, రాహుల్ ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం

‘నేషనల్ హెరాల్డ్’ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌కు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేయనుంది. ఢిల్లీ, లక్నో, ముంబైలోని రూ.661 కోట్ల ఆస్తులపై అక్కడి రిజిస్ట్రార్స్‌కు నోటీసులు పంపింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన ₹2000 కోట్ల ప్రాపర్టీస్‌ను సోనియా, రాహుల్‌కు చెందిన యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ కేవలం రూ.50 లక్షలకు అక్రమంగా దక్కించుకుందన్న ఆరోపణలపై ఈడీ 2021 నుంచి దర్యాప్తు చేస్తోంది.
Similar News
News March 22, 2026
IPLలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే 69 బంతుల్లో 195* రన్స్

అయోధ్య T20 ప్రీమియర్ లీగ్‌లో స్వస్తిక్ చికారా విధ్వంసం సృష్టించారు. గోమతి థండర్ తరఫున ఆడిన ఆయన 69 బంతుల్లోనే 195* రన్స్ చేశారు. ఇందులో 21 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. మరో ప్లేయర్ ప్రియాంశు 54 బంతుల్లో సెంచరీ చేశారు. దీంతో ఆ టీమ్ 20 ఓవర్లలో 307/0 స్కోర్ చేసింది. హిండన్ టైటాన్స్ 218 రన్స్‌కే ఆలౌటైంది. స్వస్తిక్ గతంలో DC, RCB టీమ్‌లలో ఉన్నా ఒక్క మ్యాచూ ఆడలేదు. 2026 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలారు.
News March 22, 2026
రేషన్‌కార్డుదారులకు రేపటి నుంచి కిరోసిన్

AP: గ్యాస్ కొరత నేపథ్యంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం రేపటి నుంచి లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి 2,800 కిలో లీటర్ల(ఒక కిలో లీటర్= వెయ్యి లీటర్లు) కిరోసిన్‌ను అందించిన విషయం తెలిసిందే. APని కిరోసిన్ రహిత రాష్ట్రంగా మార్చినప్పటికీ సంక్షోభ పరిస్థితుల కారణంగా మళ్లీ సరఫరా చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
News March 22, 2026
SRH బౌలింగ్ వెరీ వీక్: అభినవ్

SRH బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉన్నప్పటికీ బౌలింగ్ వీక్ అని మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ అభిప్రాయపడ్డారు. ‘బ్యాటింగ్‌కు 10/10 రేటింగ్ ఉంటే బౌలింగ్‌కు 1/10 మాత్రమే. జయ్‌దేవ్, హర్షల్‌పైనే పేస్ భారం ఉంది. మిగతా వాళ్లకు అనుభవం లేదు. టాలెంటెడ్ పేసర్లు ప్రఫుల్, ఓంకార్, షకీబ్ ఉన్నప్పటికీ ఒక్క మ్యాచూ ఆడలేదు. వేలంలో స్పెషలిస్టు బౌలర్లను కాకుండా లివింగ్‌స్టోన్‌ను కొనడం ఆశ్చర్యం కలిగించింది’ అని పేర్కొన్నారు.


