News April 12, 2025
మహిళలతో అమర్యాదగా ప్రవర్తిస్తే కేసులే: ఎస్పీ

సోషల్ మీడియా మాధ్యమాలలో ఇతరుల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఏఅర్.దామోదర్ శనివారం హెచ్చరించారు. మహిళలపై ఫోన్లలో, సోషల్ మీడియా మాధ్యమాలలో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడినా, పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలతో అమర్యాదగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News April 13, 2025
దర్శి: మహిళ దారుణ హత్య

దర్శికి చెందిన అన్నిబోయిన లక్ష్మి (45) కురిచేడు మండలం బోధనంపాడు వద్ద దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం పొలాల్లో లక్ష్మిని గుర్తుతెలియని వ్యక్తి రాయితో కొట్టి చంపేశాడు. తరువాత అతను కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 13, 2025
ప్రకాశం: 2024కి, ఇప్పటికీ 1 స్థానం డౌన్

నిన్న ఇంటర్ రిజల్ట్స్ విడుదలైన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా విద్యార్థులు ఫస్ట్ ఇయర్‌లో 63 శాతం ఉత్తీర్ణతతో 19వ స్థానం, సెకండ్ ఇయర్‌లో 79 శాతంతో 16వ స్థానంలో నిలిచారు. గత ఏడాది ఫస్ట్ ఇయర్‌లో 72 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానం, సెకండ్ ఇయర్‌లో 59 శాతంతో 15వ స్థానంలో నిలిచారు. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యార్థులు ఈ ఏడాది, గత ఏడాదికంటే మంచి మార్కులు సాధించిన ర్యాంకుల విషయంలో ఒక స్థానం కిందకి వెళ్లింది.
News April 13, 2025
ప్రకాశం జిల్లా టాపర్లు వీరే!

ఒంగోలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు తమ సత్తా చాటి జిల్లా స్థాయి ప్రథమ స్థానంలో నిలిచారు. ఎంపీసీ గ్రూప్‌లో బండి హర్షిని, కావలి హేమలత, ఎనిమి రెడ్డి సిరి 991/1000 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవగా, బైపీసీలో పాలకీర్తి హారిక 991/1000 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. వీరిని కళాశాల బృందం అభినందించింది.