News March 27, 2024
నిర్మల్: అతిగా మద్యం తాగి పర్మిట్ రూంలోనే మృతి

అతిగా మద్యం తాగిన వ్యక్తి వైన్స్ పర్మిట్ రూంలోనే మృతి చెందిన ఘటన లోకేశ్వరంలో మంగళవారం జరిగింది. SI రాజు వివరాలు.. లోకేశ్వరానికి చెందిన ప్రశాంత్ కొన్నాళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రశాంత్.. సాయంత్రం కొత్త బస్టాండ్ వద్ద ఉన్న వైన్స్ పర్మిట్ రూంలో అతిగా మద్యం తాగి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
Similar News
News March 6, 2026
ఉట్నూర్: ATCలో షార్ట్ టైం కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రభుత్వ ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో క్రాఫ్ట్ మ్యాన్ ట్రైనింగ్ స్కీమ్‌లో భాగంగా నిర్వహించే అఖిల భారత వాణిజ్య పరీక్ష షార్ట్ టైం కోర్సులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఉట్నూర్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. వివిధ కేటగిరీల వారీగా కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఏదైనా సందేహాలు ఉంటే కళాశాలకు నేరుగా వచ్చి సంప్రదించాలన్నారు.
News March 6, 2026
అతివలకు అండగా ఆదిలాబాద్ షీ టీం

ఆదిలాబాద్ జిల్లాలో మహిళల భద్రతకు షీ టీమ్స్ నిరంతరం సేవలందిస్తున్నాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గత నెలలో 54 ఫిర్యాదులు స్వీకరించి, 61 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. 118 హాట్‌స్పాట్‌లలో తనిఖీలు చేపట్టి 53 మంది పోకిరీలపై చర్యలు తీసుకున్నారు. “పోలీసు అక్క” ద్వారా విద్యాసంస్థల్లో అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 లేదా 8712659953 నంబర్లకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.
News March 5, 2026
ప్రజాపాలనతోనే అభివృద్ధి: ADB కలెక్టర్

ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. గురువారం ఆదిలాబాద్ జెడ్పీ హాల్‌లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల అమలు తీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు లబ్ధి చేకూర్చాలని కలెక్టర్ ఆదేశించారు.


