News April 12, 2025
చందుర్తి : నాలుగోతరగతి పరీక్షల్లో ఆసక్తికర సమాధానం రాసిన విద్యార్థిని

చందుర్తి మండలంలోని ఓ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని ఆంగ్లంలో అడిగిన ప్రశ్నకు సమాధానం చాలా ఆసక్తిగా రాసింది. ఈరోజు ఇంగ్లిష్ ప్రశ్నాపత్రంలో ‘మీ అమ్మకు నచ్చినది నచ్చని వాటి గురించి రాయండి’ అని అడిగారు. అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరని ఓ విద్యార్థిని సమాధానం రాయడంతో ఆ ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయారు. నేటికాలంలో ఇంట్లో కోడళ్ళకు అత్తమామల పట్ల ప్రేమ ఏ విధంగా ఉందో విద్యార్థి సమాధానం ద్వారా అర్థమవుతుందన్నారు.
Similar News
News March 25, 2026
ప.గో: కొనలేం.. తినలేం..!

పేద, మధ్యతరగతి ప్రజలకు చికెన్ భారంగా మారింది. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు చోట్ల చికెన్ ధర ఏకంగా రూ. 380కి చేరింది. దీంతో ఫంక్షన్స్ చేసుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. రానున్న రోజుల్లో ధర రూ. 400 దాటే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
News March 25, 2026
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1122 పాయింట్లు లాభ పడి 75,190కు చేరగా నిఫ్టీ 316 పాయింట్ల లాభంతో 23,272 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్‌లో ట్రెంట్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ సహా 12కుపైగా స్టాక్స్ 2%పైగా లాభాల్లో ఉన్నాయి. క్రూడ్ ధరలు తగ్గుతుండటం, యుద్ధంపై శాంతి చర్చలకు ప్రయత్నాలు జరగడం ఇందుకు ప్రధాన కారణాలు.
News March 25, 2026
శ్రీకాకుళం జిల్లాలో.. పార్లమెంట్ రెండు ముక్కలు?

నియోజకవర్గాల పునర్విభజన తెరమీదకు వచ్చిన నేపథ్యంలో జిల్లాలో ఇకపై 2 పార్లమెంటరీ నియోజకవర్గాలు కానున్నాయని రాజకీయ వర్గాల విశ్లేషణ. శ్రీకాకుళం ఒక నియోజకవర్గం కొనసాగుతుందని, మరో నియోజకవర్గం పలాస, లేదంటే టెక్కలి ఉండవచ్చునని భావిస్తున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత 8 అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లాలో ఉన్నాయి. అయితే జనాభా ఆధారంగా పూర్తిస్థాయిలో రెండు పార్లమెంరీ నియోజకవర్గాలు సాధ్యం కాదనే వాదన సైతం ఉంది.


