News April 12, 2025
రాయలసీమ: రాష్ట్ర స్థాయిలో KGBV విద్యార్థినుల సత్తా

AP ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించిన సీనియర్ ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో కర్నూలు జిల్లా పంచలింగాల KGBVకి చెందిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో మొదటి 3 ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ స్వప్న కుమారి తెలిపారు. మొదటి ర్యాంకులో టీ.మానస 992/1000, 2వ ర్యాంకులో యు. మానస 992/1000, 3వ ర్యాంకులో టీ. సుజాత 981/1000 మార్కులతో నిలిచారు.
Similar News
News April 19, 2025
కర్నూలులో క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం

కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం నూతన క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, మంత్రి టీజీ భరత్‌తో కలిసి ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పాల్గొన్నారు. అనంతరం నూతన ఆస్పత్రి భవనాన్ని సందర్శించి అక్కడ ఉండే వసతుల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆమె సూచించారు.
News April 19, 2025
IPL: ముగిసిన డీసీ ఇన్నింగ్స్.. స్కోర్ ఎంతంటే..

అహ్మదాబాద్‌లో జరుగుతున్న IPL మ్యాచ్‌లో డీసీ బ్యాటింగ్ ముగిసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఢిల్లీ 203 పరుగులు చేసింది. అశుతోశ్ (19 బంతుల్లో 37), అక్షర్ (32 బంతుల్లో 39), నాయర్ (18 బంతుల్లో 31) రాణించారు. GT బౌలర్లలో ప్రసిద్ధ్ 4, సిరాజ్, అర్షద్, ఇషాంత్, సాయి కిశోర్ తలో వికెట్ తీసుకున్నారు. GT విజయ లక్ష్యం 204 పరుగులు.
News April 19, 2025
ఆదోని మెడికల్ కాలేజీపై ఆరోగ్యశాఖ మంత్రి స్పందన

కర్నూలు జీజీహెచ్‌లో అవసరమైన ఐపీ బ్లాక్ నిర్మిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న క్రిటికల్ కేర్ బ్లాక్‌ను త్వరలోనే పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఆదోని మెడికల్ కాలేజీని అన్ని వసతులతో వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.