News April 12, 2025
హనుమాన్ శోభాయాత్రకు భారీ బందోబస్తు: SP

హనుమాన్ శోభాయాత్రకు ADBలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 300మంది సిబ్బందితో బందోబస్తు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వీడియో కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో, ప్రత్యేక సీసీ టీవీలతో పర్యవేక్షణ ఉంటుందన్నారు. ర్యాలీ పూర్తయ్యేంతవరకు హనుమాన్ విగ్రహానికి ఇరువైపులా పోలీసు సిబ్బంది ఉంటారన్నారు. అదేవిధంగా ర్యాలీ జరుగు ప్రదేశాల్లో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని సూచించారు.
Similar News
News April 14, 2025
ఆదిలాబాద్: పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి

మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
News April 14, 2025
అగ్నిమాపక వారోత్సవాలను విజయవంతం చేయండి: ADB కలెక్టర్

ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఫైర్ ఆఫీసర్ జైత్రాం, యస్దాని, సంగాన్న, తదితరులు ఉన్నారు.
News April 14, 2025
జైనథ్‌లో ఆరుగురు జూదరులు అరెస్ట్

జైనథ్‌లోని సావపూర్ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ సాయినాథ్ తెలిపారు. వారి వద్ద నుంచి పేక ముక్కలు, రూ.16,830 సీజ్ చేశామన్నారు. మండలంలో ఎక్కడైనా పేకాట, మట్కా, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లయితే సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ సూచించారు.