News April 12, 2025

SRPT రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన SP

image

సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను, పోలీస్ స్టేషన్ నిర్వహణ, పరిసరాలు, ఫిర్యాదుల నిర్వహణ, రిసెప్షన్ మేనేజ్మెంట్ మొదలైన అంశాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఫిర్యాదులపై సత్వరం స్పందించి సేవలు అందించాలని చెప్పారు. SI బాలు నాయక్, సిబ్బంది ఉన్నారు.

Similar News

News April 13, 2025

KMM: తెల్లవారుజామున ప్రమాదం.. యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. నేలకొండపల్లి మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల సమీపంలో హైవేపై ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని బైక్ ఢీకొనడంతో బైక్‌పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

News April 13, 2025

ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

image

ఖమ్మం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్ స్కిన్) కేజీ రూ.220 ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.250 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ.160- 170 మధ్య ఉంది. కాగా బడ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలతో పాటు ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?..

News April 13, 2025

సియాచిన్ డే: భారత జవాన్ల ధీరత్వానికి సెల్యూట్

image

భారత ఆర్మీ ఇవాళ సియాచిన్ డే సందర్భంగా జవాన్ల సేవలను స్మరించుకుంది. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమిగా పేరుగాంచిన సియాచిన్‌లో భారత ఆర్మీ 1984లో ఇదే రోజున ఆపరేషన్‌ మేఘదూత్ చేపట్టి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. పాక్ సరిహద్దులోని సియాచిన్‌పై పూర్తి పట్టు సాధించింది. దశాబ్దాలుగా అక్కడి విపరీత వాతావరణ పరిస్థితులను తట్టుకుని రక్షణగా నిలుస్తున్న జవాన్ల ధీరత్వానికి సెల్యూట్.

error: Content is protected !!