News April 12, 2025

3 నెలల్లో 85వేల వీసాలు.. చైనా స్నేహహస్తం!

image

సరిహద్దు వివాదాలతో భారత్‌తో కయ్యానికి కాలుదువ్వే చైనా కొంతకాలంగా మెతక వైఖరి అవలంబిస్తోంది. ఇటీవల సరిహద్దుల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్న చైనా తాజాగా భారతీయులకు వీసాల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. గత 3 నెలల్లో 85 వేల వీసాలు ఇచ్చామని చైనీస్ ఎంబసీ తెలిపింది. ‘చైనాను సందర్శించేందుకు మరింత మంది ఇండియన్ ఫ్రెండ్స్‌కు స్వాగతం’ అని ట్వీట్ చేసింది.

Similar News

News April 13, 2025

జావెలిన్ త్రోయర్‌పై నాలుగేళ్ల నిషేధం

image

భారత జావెలిన్ త్రోయర్ డీపీ మనుపై NADA నాలుగేళ్ల నిషేధం విధించింది. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్-1 సందర్భంగా అతడి నుంచి శాంపిల్స్ సేకరించగా నిషేధిత పదార్థం వాడినట్లు తేలింది. ఆ పోటీల్లో మను విజేతగా నిలవడం గమనార్హం. అయితే డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో అతడిపై నాడా తాత్కాలిక నిషేధం విధించింది. మనుపై 2028 వరకు నిషేధం కొనసాగించనున్నట్లు తాజాగా ప్రకటించింది.

News April 13, 2025

తహవూర్ రాణా అడిగిన వస్తువులు ఇవే..

image

అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన ముంబై పేలుళ్ల సూత్రదారి తహవూర్ రాణా విచారణ కొనసాగుతోంది. ఈ కరుడుగట్టిన ఉగ్రవాదిని ఢిల్లీలోని NIA ఆఫీస్‌లో ఉంచి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా అతడు పెన్ను, పేపర్‌లతో పాటు ఖురాన్ ఇవ్వాలని అధికారులను కోరారట. దీంతో వాటిని అందజేశారు. ఇతర ఖైదీల మాదిరిగానే రాణాని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం భారత్‌కు వచ్చిన రాణాకు ఢిల్లీ కోర్టు 18 రోజుల కస్టడీ విధించింది.

News April 13, 2025

ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

image

AP: ఇంటర్‌లో <<16068539>>ఫెయిలయ్యామనే<<>> బాధలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖ కొండపేటలో చరణ్‌తేజ్‌కు సెకండియర్ ఫిజిక్స్‌లో 10 మార్కులే రావడంతో ఉరివేసుకున్నాడు. ఫస్టియర్‌లో ఫెయిలవడంతో నంద్యాల(D) బండిఆత్మకూరులో చిన్నమస్తాన్, నెల్లూరు(D) చింతారెడ్డిపాలెంలో మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. కర్నూలు(D) ఆదోనిలో 2 సబ్జెక్టులు ఫెయిలైన ఓ బాలిక ఫినాయిల్ తాగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది.

error: Content is protected !!