News April 12, 2025
టీటీడీ కోటి విరాళం

టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.1 కోటిని వైజాగ్‌కు చెందిన మైత్రి ఇన్ఫాస్ట్రక్చర్ & మైనింగ్ ప్రైవేట్ లిమిటడ్ ఛైర్మన్ శ్రీనివాస్ రావ్ అందజేశారు. ముందుగా తిరుమల క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఅర్ నాయుడుని కలిసి విరాళం చెక్‌ను అందజేశారు. అనంతరం దాతను ఛైర్మన్ అభినందించారు.
Similar News
News April 13, 2025
ఏడాది చదువుకు దూరమైన బాలిక నేడు జిల్లా టాపర్

AP: కర్నూలు(D) ఆదోనికి చెందిన పేదింటి విద్యార్థిని నిర్మల ఇంటర్ బైపీసీలో 966 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. 2021-22లో టెన్త్‌లో 537 మార్కులు సాధించినప్పటికీ కుటుంబ ఆర్థిక సమస్యలతో బాలిక ఏడాదిపాటు చదువుకు దూరమైంది. అప్పటి కలెక్టర్ సృజన ప్రోత్సాహంతో ఆమె ఆస్పరి KGBVలో చేరింది. ఫస్టియర్‌లో 420, సెకండియర్‌లో 966 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది. ఐపీఎస్ కావడమే తన లక్ష్యమని చెబుతోంది.
News April 13, 2025
భీమవరం : మహిళపై ఇద్దరి అసభ్య ప్రవర్తన

ఇళ్లలో పని చేసుకుని బతుకుతున్న ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన భీమవరంలో జరిగింది. రాయలం గ్రామానికి చెందిన మహిళ భర్త చనిపోవడంతో ఇళ్లలో పనిచేసుకుని జీవిస్తోంది. గురువారం ఆమె పని నుంచి ఇంటికి వస్తుండగా అదే ప్రాంతానికి చెందిన కుమార్, అతని ఫ్రెండ్ ఆమెను అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ మేరకు మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు భీమవరం టూ టౌన్ ఎస్సై రెహమాన్ తెలిపారు.
News April 13, 2025
MHBD : BRS సిద్ధమా.. పూర్వవైభవం వచ్చేనా..?

రాష్ట్రంలో పదవి కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటుచేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ శ్రేణులతో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్ దిశానిర్దేశం చేశారు. సభతో BRSలో జోష్ వస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని వారు ఆశిస్తున్నారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలపై ఏ మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాలి మరి.