News April 12, 2025
ఇంటర్‌లో అత్యధిక మార్కులు

AP: ఇంటర్ ఫలితాల్లో పలువురు సత్తా చాటారు. హర్షిణి, హేమలత, సిరి (ప్రకాశం), లాస్య (తిరుపతి)లకు సెకండియర్ MPCలో 991 మార్కులు వచ్చాయి. Bipcలో హారిక (ప్రకాశం) 991 మార్కులు సాధించింది. ఫస్టియర్ MPCలో నాదెండ్ల కృష్ణప్రియ (పొన్నూరు) 470కి 467, భాగ్యలక్ష్మి(తిరుపతి) 465, KGBV విద్యార్థిని రేవతి (అనకాపల్లి) Bipcలో 440కి 433 మార్కులు తెచ్చుకున్నారు. మీకు తెలిసిన వారిలో ఎక్కువ మార్కులు ఎన్ని? కామెంట్ చేయండి.
Similar News
News April 13, 2025
ఏడాది చదువుకు దూరమైన బాలిక నేడు జిల్లా టాపర్

AP: కర్నూలు(D) ఆదోనికి చెందిన పేదింటి విద్యార్థిని నిర్మల ఇంటర్ బైపీసీలో 966 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. 2021-22లో టెన్త్‌లో 537 మార్కులు సాధించినప్పటికీ కుటుంబ ఆర్థిక సమస్యలతో బాలిక ఏడాదిపాటు చదువుకు దూరమైంది. అప్పటి కలెక్టర్ సృజన ప్రోత్సాహంతో ఆమె ఆస్పరి KGBVలో చేరింది. ఫస్టియర్‌లో 420, సెకండియర్‌లో 966 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది. ఐపీఎస్ కావడమే తన లక్ష్యమని చెబుతోంది.
News April 13, 2025
అభిషేక్ వద్ద అప్పటి నుంచే ఆ నోట్ ఉంది: హెడ్

PBKSతో నిన్నటి మ్యాచ్‌లో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ అనంతరం క్రేజీ సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. 40 బంతుల్లోనే శతకం బాదిన క్రమంలో ఆరెంజ్ ఆర్మీకి <<16080847>>ఓ నోట్<<>> చూపించారు. దానిపై ఆ జట్టు మరో ఓపెనర్ హెడ్ స్పందించారు. ‘అభిషేక్ జేబులో ఆ నోట్ 6 మ్యాచ్‌ల నుంచి అలాగే ఉంది. ఉప్పల్‌లో అది బయటకు రావడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. మరోవైపు, అభిషేక్ 55 బంతుల్లోనే 141 రన్స్ బాది మ్యాచ్‌ను వన్ సైడ్ చేశారు.
News April 13, 2025
892 మార్కులొచ్చినా.. ఇంటర్ విద్యార్థిని ఫెయిల్

AP: విజయవాడ పటమటకు చెందిన ఇంటర్ విద్యార్థిని రాజేశ్వరికి నిన్న విడుదలైన ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 892 మార్కులొచ్చినా ఫెయిలైంది. ఆమెకు సంస్కృతంలో 98, మ్యాథ్స్ 2Aలో 73, 2Bలో 75, ఫిజిక్స్‌లో 60, కెమిస్ట్రీలో 60, 2 ప్రాక్టికల్స్‌లో 60 మార్కులు రాగా.. ఇంగ్లిష్‌లో 5 మార్కులే వచ్చినట్లు మార్కుల లిస్టులో చూపిస్తోంది. కష్టపడి చదివినా ఇంగ్లిషులో 5 మార్కులే రావడం పట్ల విద్యార్థిని కన్నీరుమున్నీరయ్యారు.