News April 12, 2025

నంద్యాల: ఇంటర్ ఫెయిల్ కావడంతో విద్యార్థి ఆత్మహత్య.!

image

ఇంటర్ ఫెయిల్ అయినందుకు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బండి ఆత్మకూరుకి చెందిన మస్తాన్ అనే విద్యార్థి నంద్యాల గవర్నమెంట్ కాలేజీలో చదివాడు. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో మనస్థాపం చెంది ఉరి వేసుకొని <<16067190>>ఆత్మహత్య చేసుకున్నాడు.<<>> తండ్రి పెద్ద మౌలాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు.

Similar News

News March 9, 2026

మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే ఉపేక్షించబోం: CBN

image

AP: గత ఐదేళ్లూ కల్తీ, కుంభకోణాలు చేశారని CM చంద్రబాబు ఆరోపించారు. నంద్యాల(D) కొత్తబురుజులో మాట్లాడుతూ కల్తీ మద్యంతో వేల మంది మరణానికి వైసీపీ నేతలు కారణమయ్యారని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్నీ కల్తీ చేసి ఆలయ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కుట్రపూరితంగా మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, వీటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

News March 9, 2026

తిరుపతి: 315 మంది గైర్హాజరు

image

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 96 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 21,379 మంది విద్యార్థులకు గాను 21,064 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 315 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలియజేశారు.

News March 9, 2026

తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా?

image

తిన్న తర్వాత బాడీ ‘డైజెషన్ మోడ్’లోకి వెళ్తుంది. రక్తం అంతా పొట్ట దగ్గరకు చేరి ఆహారాన్ని అరిగించే పనిలో ఉంటుంది. అలాంటి టైమ్‌లో వెంటనే స్నానం చేస్తే బాడీ టెంపరేచర్‌ని కంట్రోల్ చేయడం కోసం బ్లడ్ సర్క్యులేషన్‌ను అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల డైజెషన్ ప్రాసెస్ స్లో అయిపోయి.. కడుపు ఉబ్బరం, హెవీనెస్, గ్యాస్ వంటి సమస్యలొస్తాయి. అందుకే తిన్న తర్వాత 30 నుంచి 45 నిమిషాల గ్యాప్ ఇచ్చి స్నానం చేస్తే బెస్ట్.