News April 12, 2025

ఇంటర్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ మన బందరు అమ్మాయికే 

image

నేడు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మచిలీపట్నం లేడి యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన ఎ.బాల త్రిపుర సుందరి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. క్యాంబెల్ పేటకు చెందిన త్రిపుర సుందరి 1000 మార్కులకు గాను 980 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆ విద్యార్థినిని కాలేజీ ప్రిన్సిపల్ అభినందించారు.  

Similar News

News April 14, 2025

కృష్ణా: రేపు స్పందన కార్యక్రమం రద్దు- కలెక్టర్

image

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని ఈ సోమవారం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. అర్జీలు ఇచ్చేందుకు వచ్చే వారు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.

News April 13, 2025

కృష్ణా: రేపు కలెక్టరేట్‌లో ‘మీకోసం’ రద్దు- కలెక్టర్

image

సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

News April 13, 2025

గుడివాడలో వ్యభిచారం.. నలుగురి అరెస్ట్ 

image

గుడివాడ తాలూకా పోలీస్‌ స్టేషన్ పరిధిలో అసభ్య కార్యకలాపాలపై సమాచారం మేరకు ఎస్‌ఐ చంటిబాబు దాడులు నిర్వహించారు. శనివారం మల్లాయపాలెంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచార కేంద్రంగా మార్చిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి 2 సెల్‌ఫోన్‌లు, బైక్‌, రూ.2వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

error: Content is protected !!