News April 12, 2025
పూరన్ విధ్వంసం.. LSG గ్రాండ్ విక్టరీ

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో LSG గ్రాండ్ విక్టరీ సాధించింది. 181 పరుగుల టార్గెట్‌ను 19.3 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఓపెనర్ మార్క్‌రమ్ (58) హాఫ్ సెంచరీతో రాణించారు. నికోలస్ పూరన్ (1 ఫోర్, 7 సిక్సర్లతో 61 రన్స్) విధ్వంసంతో జట్టు విజయం సాధించింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు. రషీద్, సుందర్ చెరో వికెట్ తీశారు.
Similar News
News April 13, 2025
ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ఠ: హరీశ్ రావు

TG: SLBC టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తయినా సహాయక చర్యల్లో పురోగతి లేదని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. హెలికాప్టర్‌లో వెళ్లి మంత్రులు పెట్టిన డెడ్‌లైన్లు మారాయే తప్ప ప్రయోజనం లేదని ఫైరయ్యారు. ఇది INC ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ఠ అని పేర్కొన్నారు. వారి మృతదేహాలను ఎప్పటికి బయటకు తీసుకొస్తారని ప్రశ్నించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
News April 13, 2025
సియాచిన్ డే: భారత జవాన్ల ధీరత్వానికి సెల్యూట్

భారత ఆర్మీ ఇవాళ సియాచిన్ డే సందర్భంగా జవాన్ల సేవలను స్మరించుకుంది. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమిగా పేరుగాంచిన సియాచిన్‌లో భారత ఆర్మీ 1984లో ఇదే రోజున ఆపరేషన్ మేఘదూత్ చేపట్టి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. పాక్ సరిహద్దులోని సియాచిన్‌పై పూర్తి పట్టు సాధించింది. దశాబ్దాలుగా అక్కడి విపరీత వాతావరణ పరిస్థితులను తట్టుకుని రక్షణగా నిలుస్తున్న జవాన్ల ధీరత్వానికి సెల్యూట్.
News April 13, 2025
అటు ప్రీతి జింటా, ఇటు కావ్యా మారన్(VIRAL)

SRH-PBKS మ్యాచ్ సందర్భంగా ఆయా జట్ల ఓనర్లు కావ్యా మారన్, ప్రీతి జింటా ఉప్పల్‌లో సందడి చేశారు. తమ ప్లేయర్లు సిక్సర్లు, ఫోర్లు కొట్టినప్పుడు, వికెట్లు పడినప్పుడు వారు ఇచ్చిన హావభావాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అభిషేక్ శర్మ సెంచరీ చేయగానే కావ్యా అతని పేరెంట్స్ దగ్గరికెళ్లి అభినందనలు తెలిపారు. మ్యాచ్ తర్వాత అభిషేక్ ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్‌ను గుర్తుచేస్తూ ప్రీతి కంగ్రాట్స్ చెప్పడం విశేషం.