News April 12, 2025

అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయండి: కలెక్టర్

image

ఈ నెల 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సభ గోడపత్రికలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, తదితరులు ఆవిష్కరించారు.

Similar News

News December 30, 2025

KNR: ‘మహా శివరాత్రి జాతరకు పటిష్ఠ బందోబస్తు’

image

ఫిబ్రవరి 14, 15, 16వ తేదీలో వేములవాడలో జరుగనున్న మహా శివరాత్రి జాతరకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. జాతర సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతర సందర్భంగా 8 మంది డీఎస్పీలు, 38 మంది సీఐలు, 119 మంది ఎస్సైలు, 158 ఏఎస్సైలు, 388 కానిస్టేబుళ్లు, హోమ్ గార్డ్స్‌తో కలిపి మొత్తం 1300 మందికి పైగా పోలీసులు మూడు రోజులు బందోబస్తు నిర్వహిస్తారని వెల్లడించారు.

News December 30, 2025

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నేడు ఏం దానం చేయాలంటే?

image

వైకుంఠ ఏకాదశి పర్వదినాన దానాలు చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ‘దుప్పట్లు, వస్త్రాలు దానం చేయడం శ్రేష్ఠం. స్తోమత ఉంటే గోదానం చేయవచ్చు. ఇది ఎంతో పుణ్యాన్నిస్తుంది. సమాజంలో గౌరవం, ఆర్థికాభివృద్ధిని తెస్తుంది. అన్నదానం, అవసరమైన వారికి ఆర్థిక సాయం చేస్తే పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పవిత్ర రోజున స్వార్థం వీడాలని, చేసే చిన్న దానలైనా తృప్తిగా చేయాలని పండితులు చెబుతున్నారు.

News December 30, 2025

రామచంద్రపురం: సంక్రాంతికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

image

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్, మియాపూర్ ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్లేవారి కోసం హెచ్‌ఈఎల్ డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులు జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు నడుస్తాయి. ఆర్సీపురం నుంచి బయలుదేరే ఈ బస్సులు బయలుదేరనున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు.