News April 12, 2025

ప్రతీకార సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం

image

ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లకు మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో యాపిల్, శాంసంగ్ వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. సాధారణంగా ఎలక్ట్రానిక్స్ పరికరాలు అమెరికాలో ఎక్కువగా ఉత్పత్తి అవ్వవు. వీటిని పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటుంది. ఈ నిర్ణయంతో ఎలక్ట్రానిక్స్ ధరలపై అదనపు సుంకం భారం ఉండదు.

Similar News

News April 13, 2025

రాష్ట్రంలో మరికాసేపట్లో వర్షం

image

AP: రాష్ట్రంలో రాబోయే 3 గంటల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని APSDMA తెలిపింది. కోనసీమ, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో వర్షం కురుస్తుందని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని పేర్కొంది.

News April 13, 2025

కైలాసపట్నం ప్రమాదంపై పవన్, లోకేశ్ దిగ్భ్రాంతి

image

AP: కైలాసపట్నం అగ్నిప్రమాదంపై Dy.CM పవన్, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ‘ఇటీవల అల్లూరి జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు విశాఖ పరిశ్రమల్లో తీసుకోవాల్సిన భద్రతపరమైన జాగ్రత్తల గురించి చర్చించాలనుకున్నా. కానీ అత్యవసరంగా సింగపూర్ వెళ్లాల్సి వచ్చింది. తదుపరి విశాఖ పర్యటనలో దీనిపై దృష్టిపెడతా’ అని పవన్ తెలిపారు.

News April 13, 2025

అలాంటి యాడ్స్ మాత్రమే చేస్తా: సమంత

image

ఒకప్పుడు తనకు నచ్చిన బ్రాండ్స్‌ని ప్రమోట్ చేశానని, అందుకు తన ఫాలోవర్స్‌కి క్షమాపణలు చెబుతున్నానని హీరోయిన్ సమంత తెలిపారు. ఈ ఏడాది 15 బ్రాండ్స్ వదులుకున్నట్లు ఆమె చెప్పారు. ‘ప్రస్తుతం బ్రాండ్స్ ప్రమోట్ విషయంలో బాధ్యతగా ఉంటున్నా. నా వద్దకు ఎన్నో యాడ్స్ వస్తుంటాయి. కానీ ఆ ఉత్పత్తులను నాకు తెలిసిన డాక్టర్లతో పరీక్షలు చేయిస్తా. అవి ప్రజలకు హానీ చేయవని నిర్ధారణ అయ్యాకే ప్రమోట్ చేస్తున్నా’ అని తెలిపారు.

error: Content is protected !!