News April 12, 2025

అమలాపురం వైసీపీ ఇన్‌ఛార్జిగా పినిపే

image

AP: వైసీపీ పలు పదవులకు నియామకాలు చేపట్టింది. అమలాపురం అసెంబ్లీ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా పినిపే శ్రీకాంత్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని నియమించింది.

Similar News

News April 13, 2025

BSPలోకి మాయావతి మేనల్లుడు రీఎంట్రీ

image

తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తిరిగి పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు BSP అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఆకాశ్ తన తప్పులను బహిరంగంగా ఒప్పుకున్నందుకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. తన వారసులుగా ఎవరినీ ప్రకటించడం లేదని స్పష్టం చేశారు. ఇవాళ ఆనంద్ X వేదికగా మాయావతికి క్షమాపణలు చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని కొన్ని రోజుల క్రితం ఆయనను మాయావతి పార్టీ నుంచి బహిష్కరించారు.

News April 13, 2025

డ్రోన్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్: డ్రోన్ కార్పొరేషన్

image

AP: రాష్ట్రాన్ని డ్రోన్ రాజధానిగా తీర్చిదిద్దుతామని డ్రోన్ కార్పొరేషన్ తెలిపింది. డ్రోన్ల తయారీలో ప్రపంచంలోనే ఒక బలమైన శక్తిగా అవతరిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ప్రజలు, పాలనకు ఉపయోగపడేలా డ్రోన్ సేవలు విస్తృతం చేస్తాం. ఓర్వకల్లులో 300 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ సిటీ అభివృద్ధి చేస్తున్నాం. ఈ నెల 21లోగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి కొత్త యూజ్ కేసెస్‌ను ఆహ్వానిస్తున్నాం’ అని పేర్కొంది.

News April 13, 2025

చికెన్ ఎక్కువగా తింటే?

image

కొందరికి చికెన్ లేనిదే ముద్ద దిగదు. రోజూ చికెన్ తింటే ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ ఎక్కువ మోతాదులో తింటే బీపీ, గుండె జబ్బులు వస్తాయి. కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు. రక్తంలో టాక్సిన్లు నిల్వ ఉండి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముంది. యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోయి చేతి, కాలి వేళ్లలో స్ఫటికాలు పేరుకుపోయి కీళ్ల నొప్పులు వస్తాయి. వారానికి ఒకటి రెండు సార్లు తినడం ఉత్తమం.

error: Content is protected !!