News April 12, 2025
జగన్ ప్రధాన సలహాదారుడిగా సజ్జల

AP: 33 మందితో కూడిన PACని వైసీపీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సజ్జల రామకృష్ణారెడ్డిని కన్వీనర్‌గా నియమించింది. సజ్జలతోపాటు తమ్మినేని, ముద్రగడ, కొడాలి నాని, జోగి రమేశ్, తోట త్రిమూర్తులు, పినిపే విశ్వరూప్, కోన రఘుపతి, విడదల రజిని, రోజా, బ్రహ్మనాయుడు, నందిగం సురేశ్, ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, వైఎస్ అవినాశ్, బుగ్గన, సాకే శైలజానాథ్ తదితరులు ఉన్నారు. వీరంతా జగన్‌కు రాజకీయ సలహాలు ఇవ్వనున్నారు.
Similar News
News April 13, 2025
బ్రదర్.. నా గురించి బాధపడొద్దు: నిధి అగర్వాల్

సినిమాలు చేయడంలో తనకు తొందర లేదని, మంచి సినిమాల్లో భాగమవడం కోసమే టైమ్ తీసుకుంటున్నట్లు నిధి అగర్వాల్ తెలిపారు. ‘ఇస్మార్ట్ శంకర్(2019) తర్వాత నిధి ఎన్ని సినిమాలు చేసింది? 2021లో వచ్చిన శ్రీలీల 20+ మూవీస్ చేసింది’ అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ఆమె రిప్లై ఇచ్చారు. ‘2019 తర్వాత తెలుగులో హీరో మూవీ, తమిళంలో 3 సినిమాలు చేశా. తర్వాత HHVM, రాజాసాబ్ చేస్తున్నా. బ్రదర్.. నా గురించి బాధపడొద్దు’ అని సూచించారు.
News April 13, 2025
రోహిత్ పని అయిపోయినట్లేనా?

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మళ్లీ నిరాశపరిచారు. డీసీతో జరుగుతున్న మ్యాచులో 18 పరుగులే చేసి విఫలమయ్యారు. 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా అనూహ్యంగా విప్రజ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయారు. ఈ సీజన్‌లో CSKపై డకౌట్, GTపై 8, KKRపై 13, RCBపై 17, DCపై 18 పరుగులు చేశారు. కాగా గత IPL సీజన్ నుంచి హిట్‌మ్యాన్ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడని విషయం తెలిసిందే.
News April 13, 2025
16న జపాన్ పర్యటనకు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ఖరారైంది. ఈ నెల 16 నుంచి 22 వరకు సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందం జపాన్‌లో పర్యటించనుంది. టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనుంది.