News April 12, 2025
రాజమండ్రి: ఇంటర్ స్టేట్ టాపర్లను అభినందించిన మంత్రి దుర్గేష్

ఇంటర్ ఫలితాలలో స్టేట్ టాప్ ర్యాంక్ లను సాధించిన విజేతలను మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. రాజమండ్రిలో శనివారం జరిగిన కార్యక్రమంలో తన అంధత్వాన్ని ఎదురించి హెచ్ఇసీ సోషల్ స్టడీస్ లో 955 /1000 మార్కులు సాధించిన షేక్ ఫర్జానాను ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక అల్కాట్ గార్డెన్స్ లో ఇంటర్ విద్యార్థులను అభినందించారు
Similar News
News August 18, 2025
తూర్పు గోదావరి జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
News August 17, 2025
తూ.గో: రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మ.1 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రజలు తమ అర్జీలను అందజేయొచ్చన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గూర్చి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
News August 17, 2025
రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సూచించారు. వర్షాల కారణంగా పంటలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని, రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. పంటల రక్షణ కోసం శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని కలెక్టర్ సూచించారు.