News April 12, 2025
నరసరావుపేట: ఎస్పీ కంచి శ్రీనివాసరావు కీలక సూచన

పల్నాడు జిల్లాలోని పోలీస్ కార్యాలయంలో ఈనెల 14న సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. ఇందులో భాగంగా సోమవారం జరిగే ప్రజా సమస్యలపరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ గమనించి సహకరించాలన్నారు.
Similar News
News April 14, 2025
నేటి నుంచి ‘భూభారతి’

TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘భూభారతి’ చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. CM రేవంత్ రెడ్డి ఇవాళ ఆ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లు ధరణిలో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతిలో జరగనున్నాయి. రాష్ట్రమంతటా ఒకేసారి ఈ చట్టాన్ని అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావించింది. అందువల్ల తొలుత తిరుమలగిరి సాగర్, కీసర, సదాశివపేట మండలాల్లో అమలు చేయనుంది.
News April 14, 2025
నేడు లక్నోతో చెన్నై ఢీ.. ఓడితే CSK ఇంటికే!

IPLలో ఇవాళ LSG, CSK తలపడనున్నాయి. ఇప్పటి వరకు వీటి మధ్య 5 మ్యాచ్‌లు జరగ్గా లక్నో మూడింటిలో గెలిచింది. ఓ మ్యాచ్‌లో CSK విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో రిజల్ట్ రాలేదు. కూతురికి అనారోగ్యం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ ఇవాళ్టి మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. ఆడిన 6 మ్యాచుల్లో 5 ఓటములతో పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న CSK ఇవాళ కూడా ఓడితే ఫ్లే ఆఫ్స్ రేస్ నుంచి దాదాపు తప్పుకున్నట్లే.
News April 14, 2025
గత ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తానని ఇవ్వలేక పోయింది: భట్టి

ఖమ్మం: గత ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తానని ప్రజలను నమ్మించి ఇవ్వలేకపోయిందని కానీ, తాము అలా కాకుండా ఇచ్చిన హామీని అమలు చేశామని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ₹13,523 కోట్లు వెచ్చించి లబ్ధిదారులకు సన్నబియ్యం అందిస్తుందని చెప్పారు. సన్నబియ్యం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్వరలోనే 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరుచేస్తామన్నారు.