News April 12, 2025

దంచికొడుతున్న SRH ఓపెనర్లు

image

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో SRH ఓపెనర్లు దంచికొడుతున్నారు. అభిషేక్ శర్మ (87*), ట్రావిస్ హెడ్ (49*) ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్నారు. అభిషేక్‌కు ఓ లైఫ్ రావడంతో రెచ్చిపోయి ఆడుతున్నారు. వీరిద్దరి ధాటికి SRH 10 ఓవర్లకు 143/0 పరుగులు చేసింది. SRH విజయానికి మరో 10 ఓవర్లలో 103 రన్స్ అవసరం. మరి ఎన్ని ఓవర్లలో హైదరాబాద్ టార్గెట్ ఛేజ్ చేస్తుందో కామెంట్ చేయండి.

Similar News

News April 14, 2025

విద్యార్థులతో ‘జైశ్రీరామ్’ నినాదాలు.. కొత్త వివాదంలో TN గవర్నర్

image

తమిళనాడు గవర్నర్ R.N.రవిపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. మధురైలోని ఓ కళాశాల విద్యార్థులతో ‘జైశ్రీరామ్’ నినాదాలు చేయించారు. మతాలకు అతీతమైన పదవిలో ఉండి ఇలా చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఆయన్ను వెంటనే రీకాల్ చేయాలని DMK, కాంగ్రెస్, CPI నేతలు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా, లౌకికవాదానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

News April 14, 2025

అంబేడ్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం: CM

image

AP: ఆధునిక భారత సమాజ నిర్మాణానికి అంబేడ్కర్ పునాదులు వేశారని సీఎం చంద్రబాబు కొనియాడారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుందామన్నారు. ‘ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషి చేద్దాం. అంబేడ్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం’ అని ట్వీట్ చేశారు.

News April 14, 2025

అంబేడ్కర్ ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ పాలన: KCR

image

TG: డా.బీ.ఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు మాజీ సీఎం KCR నివాళులు అర్పించారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా BRS పాలన సాగిందని, దళితబంధు సహా అనేక పథకాలను అమలు చేశామని తెలిపారు. నేటి ప్రభుత్వం వాటిని కొనసాగించాలని, అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

error: Content is protected !!