News April 13, 2025
తిరుమల: PIC OF THE DAY

ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం రాత్రి శ్రీవారి ఆనంద నిలయం చంద్రుని కాంతిలో మెరిసిపోయింది. పౌర్ణమి చంద్రుడు ఆలయ శిఖరంపై తన ప్రకాశాన్ని విరజిమ్ముతూ భక్తులను మంత్ర ముగ్ధులను చేశాడు. ‘ఓ చంద్రమా, నా ఆనంద నిలయం నుంచి ప్రపంచానికి చల్లటి నీడను ఇవ్వు’ అన్న భావనను నిజం చేస్తూ తిరుగిరులపై చంద్రుని చల్లని వెలుగు పరచుకుంది.
Similar News
News March 14, 2026
గ్యాస్ బుకింగ్ పేరిట మోసాలు: సీపీ హెచ్చరిక

గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం హెచ్చరించారు. నకిలీ లింకులు, ఎస్ఎంఎస్ల ద్వారా కేవైసీ, ఓటీపీ వివరాలు కోరుతూ నగదు కాజేస్తున్నారని తెలిపారు. గ్యాస్‌ను కేవలం అధికారిక యాప్‌ల ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించారు. బాధితులు వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని కోరారు.
News March 14, 2026
సిలిండర్ల బుకింగ్ మాటున సైబర్ కేటుగాళ్లు

TG: గ్యాస్ బుకింగ్ పేరిట సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘వారు పంపే APK ఫైళ్లను ఓపెన్ చేయొద్దు. సిలిండర్ తక్షణ డెలివరీ, ముందస్తు చెల్లింపులు అంటూ వచ్చే కాల్స్‌ను నమ్మొద్దు. బుకింగ్‌కు అధికారిక వెబ్సైట్లను వినియోగించాలి. లేదా ఏజెన్సీ వద్దకు వెళ్లాలి. మోసానికి గురైతే 1930కి కాల్ చేయాలి. http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి’ అని సూచించారు.
News March 14, 2026
కొండగట్టు అగ్నిప్రమాద బాధితులకు విరాళాల ద్వారా ఆర్థిక సాయం

కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు విరాళాలు సేకరించిన స్థానికులు ఇవాళ వారికి అందజేశారు. గత సంవత్సరం నవంబర్ 29న కొండగట్టు దిగువన సంభవించిన అగ్నిప్రమాదానికి దాదాపు 23 బొమ్మల దుకాణాలు దగ్ధమయ్యాయి. భాదితులకు సహాయం చేయడానికి స్థానిక యువత, ప్రజలు తమ వంతు సహాయంగా “Helping Hands for Kondagattu Fire Accident” అనే గ్రూప్ తయారు చేసి, విరాళాలు సేకరించారు. సేకరించిన రూ.5,73,000 బాధితులకు అందజేశారు.


