News April 13, 2025
అభిషేక్.. రప్పా.. రప్పా!

IPL: 246 పరుగుల భారీ లక్ష్యఛేదనలో SRH దుమ్మురేపుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. 6 సిక్సర్లు, 11 ఫోర్లతో పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశారు. మరో ఓపెనర్ హెడ్ (37 బంతుల్లో 66) మెరుపులు మెరిపించి ఔటయ్యారు. SRH విజయానికి మరో 42 బంతుల్లో 71 పరుగులు అవసరం.
Similar News
News April 14, 2025
అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మళ్లీ తీసుకొస్తాం: CM

AP: అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. గుంటూరు(D) పొన్నెకల్లులో మాట్లాడుతూ ‘పేదలకు అండగా ఉంటాం. రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్య, భోజనం అందిస్తాం. అమరావతికి ప్రతిష్టాత్మక వర్సిటీలు, కాలేజీలను తీసుకొస్తాం’ అని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ చూడని రాజకీయం 2019-24 మధ్య చూశానని, తనలాంటి వాళ్లు కూడా బయటకు రాని పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు.
News April 14, 2025
ట్రైన్ వెయిటింగ్ లిస్టులో రకాలు..

*వెయిటింగ్ లిస్టు (WL): ఇది సాధారణంగా ఉండేది.
*జనరల్ (GNWL): ట్రైన్ స్టార్ట్ అయ్యే/దగ్గరి స్టేషన్ నుంచి ప్రయాణించే వారు ఈ లిస్టులో ఉంటారు.
*పూల్డ్ కోటా (PQWL): ట్రైన్ రూట్ మధ్యలో ఉండే స్టేషన్స్‌లో ఎక్కేవారికి ఈ లిస్ట్ వర్తిస్తుంది.
*రోడ్ సైడ్ స్టేషన్ (RSWL): చిన్న, రోడ్డుసైడ్ స్టేషన్స్ నుంచి ఎక్కేవారికి,
>GNWLలో టికెట్స్ కన్ఫమ్ అయ్యే అవకాశం ఎక్కువగా
ఉంటుందట.
News April 14, 2025
హంతకుడి ఎన్కౌంటర్.. ఈ ‘లేడీ సింగం’ గురించి విన్నారా?

కర్ణాటక హుబ్బళ్లిలో ఐదేళ్ల చిన్నారిపై రేప్ అటెంప్ట్ చేసి చంపిన నిందితుడిని <<16090804>>ఎన్కౌంటర్<<>> చేసింది PSI అన్నపూర్ణ. ఆస్పత్రిలో బాలిక మృతదేహాన్ని చూసి ఆమె ఏడ్చేశారు. నిందితుడు రితేశ్ కోసం వేట కొనసాగించారు. లొంగిపోమని కోరగా రితేశ్ పోలీసులపై రాళ్లు రువ్వాడు. దీంతో అన్నపూర్ణ రితేశ్‌పై కాల్పులు జరపగా రెండు బుల్లెట్లు తగిలి అతడు హతమయ్యాడు. అందరూ అన్నపూర్ణను లేడీ సింగం అంటూ ప్రశంసిస్తున్నారు.