News April 13, 2025
VIRAL: మా అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరు: విద్యార్థిని

TG: రాజన్న సిరిసిల్ల(D) చందుర్తిలో ఓ నాలుగో తరగతి విద్యార్థిని పరీక్షలో ఆసక్తికర సమాధానం రాసింది. ఇంగ్లిష్ ప్రశ్నాపత్రంలో ‘మీ అమ్మకు నచ్చిన, నచ్చనివి ఏవి’ అని అడిగారు. అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరని విద్యార్థిని సమాధానం రాసింది. ఇందుకు సంబంధించిన ఫొటో SMలో వైరల్ అవుతుండగా, నేటి కాలంలో కోడళ్లకు అత్తమామల పట్ల ఎలాంటి భావన ఉందో దీని ద్వారా తెలుస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News April 14, 2025
రాజ్యాంగాన్ని కాంగ్రెస్ బుజ్జగింపు సాధనంగా వాడింది: మోదీ

కాంగ్రెస్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని బుజ్జగింపు సాధనంగా వాడిందని ప్రధాని మోదీ విమర్శించారు. హస్తం పార్టీ తన అధికారానికి ముప్పు ఉందని భావించినప్పుడల్లా దేశ అత్యున్నత శాసనాన్ని తుంగలో తొక్కేదని నొక్కిచెప్పారు. రాజ్యాంగంతో దేశంలో సామాజిక న్యాయం జరుతుందని భావించిన అంబేడ్కర్ ఆశయాలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. హరియాణాలో హిసార్ విమానాశ్రయంలో ప్లాంటును PM ప్రారంభించారు.
News April 14, 2025
నెలకు సగటున 15 ఆవులు మరణిస్తాయి: శ్యామలారావు

AP: భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ వ్యాఖ్యలు చేశారని టీటీడీ ఈవో శ్యామలారావు విమర్శించారు. 3 నెలల్లో 100 ఆవులు చనిపోయాయని అసత్య ప్రచారం చేశారన్నారు. ప్రతి నెలా సగటున 15 ఆవులు మరణిస్తాయని, 3 నెలల్లో 43 మృతి చెందాయని తెలిపారు. దాతలు ఇచ్చిన ఆవుల్లో కొన్ని అనారోగ్యంతో చనిపోయాయని చెప్పారు. మరణించిన ఆవులకు పోస్టుమార్టం చేయలేదనడం అవాస్తవమన్నారు.
News April 14, 2025
2021-24 మధ్య గోశాలలో అక్రమాలు: TTD EO

AP: తిరుమలలోని గోశాల నిర్వహణలో మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు ఎన్నో అక్రమాలు జరిగాయని టీటీడీ ఈవో శ్యామలారావు ఆరోపించారు. గత ఐదేళ్లలో చనిపోయిన ఆవుల వివరాలను దాచిపెట్టారన్నారు. ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పారు. అలాగే స్వామివారికి ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో అక్రమాలు చోటుచేసుకున్నాయని వివరించారు. రూ.3 కోట్ల విలువైన సరకులకు రూ.25 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు.