News April 13, 2025
SRPT: ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి: అ.కలెక్టర్

అనంతగిరి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు శనివారం ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని సూచించారు.
Similar News
News September 16, 2025
రూ.2 లక్షల వరకు ధరలు తగ్గింపు

ప్రీ GST, పండుగ డిస్కౌంట్ కింద కార్ల కంపెనీ కియా ఇండియా తెలుగు రాష్ట్రాల ప్రజలకు రూ.2 లక్షల వరకు ఆఫర్ ప్రకటించింది. సెల్టోస్ మోడల్‌పై రూ.2 లక్షలు, కారెన్స్ క్లావిస్‌పై రూ.1.33 లక్షలు, కారెన్స్‌పై రూ.1.02 లక్షల తగ్గింపు పొందవచ్చని పేర్కొంది. సెప్టెంబర్ 22 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఆఫర్ ఉందని, అయితే ధరల్లో మార్పు ఉంటుందని వెల్లడించింది.
News September 16, 2025
గుంటూరు: నేడు కోడెల వర్ధంతి

ప్రముఖ రాజకీయ నాయకుడు, నవ్యాంధ్ర తొలి సభాపతి, పల్నాటి పులిగా పేరుపొందిన కోడెల శివప్రసాదరావు 1947 మే 2న ఉమ్మడి గుంటూరు జిల్లా కండ్లగుంటలో జన్మించారు. డాక్టర్‌గా పని చేస్తూనే 1983లో టీడీపీలో చేరారు. 1983 నుంచి 2004 వరకు వరసగా 5సార్లు నరసరావుపేట నుంచి గెలిచారు. ఆయన పలు శాఖల మంత్రిగా పనిచేశారు. 2014లో గెలిచి నవ్యాంధ్ర తొలి శాసన సభాపతి అయ్యారు. 2019 సెప్టెంబరు 16న హైదరాబాదులో ఆయన స్వగృహంలో మరణించారు.
News September 16, 2025
మెదక్-సిద్దిపేట మార్గంలో రాకపోకలు పునరుద్ధరణ

మెదక్-సిద్దిపేట రహదారిపై నందిగామ వద్ద వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో గత 20 రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. కల్వర్టు దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గం సిద్ధం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.