News March 27, 2024

కృష్ణా : ఈ నెల 30తో ముగియనున్న ధాన్యం కొనుగోళ్ల గడువు

image

ఈ నెల 30వ తేదీతో ఖరీఫ్ ధాన్యం సేకరణ గడువు ముగుస్తుందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 55,562 మంది రైతుల నుండి 1070.07కోట్లు విలువ గల 4,88,590 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించినట్లు చెప్పారు. ధాన్యం సేకరణ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇంకనూ ధాన్యం విక్రయించని రైతులు వెంటనే రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలన్నారు.

Similar News

News April 6, 2026

కృష్ణా: తమీమ్ అన్సారియాను కలిసిన ఎస్జీఎఫ్ఐ

image

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తమీమ్ అన్సారియాను సోమవారం ఎస్జీఎఫ్ఐ ప్రతినిధులు కలిశారు. రాష్ట్ర పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి భానుమూర్తి రాజుతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల కార్యదర్శులు రాంబాబు, శిరీషలు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి, దుశ్శాలువాతో సత్కరించారు. రాష్ట్రంలో పాఠశాల స్థాయి క్రీడల అభివృద్ధికి, పోటీల నిర్వహణకు పూర్తి సహకారం అందించాలని వారు కమిషనర్‌ను కోరారు.

News April 3, 2026

చల్లపల్లి: అగ్ని ప్రమాద బాధితులకు సహాయం అభినందనీయం

image

అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సహాయం అభినందనీయం అని డీఆర్ఓ సీసీ వెంకటేశ్వరరావు అన్నారు. చల్లపల్లి మండలం మంగళాపురంలో ఇటీవల అగ్నిప్రమాదంలో కర్రా లక్ష్మయ్య పూరిల్లు కాలిపోయింది. వారికి శుక్రవారం రెడ్ క్రాస్ చల్లపల్లి ఛైర్మన్ లీలాబ్రహ్మేంద్ర స్టీల్ సామాన్లు, నిత్యావసర సరుకులు, టార్పాలిన్, రగ్గు, జిల్లా ఛైర్మన్ డాక్టర్ డీ.ఆర్.కే ప్రసాద్ ద్వారా రూ.5వేలు ఆర్థిక సహాయం అందచేశారు.

News April 3, 2026

కృష్ణా : సర్పంచ్‌ల పాలనకు సెలవ్..!

image

కృష్ణా జిల్లాలో గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. సర్పంచ్‌ల పదవీ కాలం ముగియటంతో నేటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వం మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. జిల్లాలో మొత్తం 497 పంచాయతీలు ఉండగా వివిధ కారణాల వల్ల 17 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 470 పంచాయతీల సర్పంచ్ టైమ్ అయిపోవటంతో అక్కడ ప్రత్యేక అధికారులను నియమించారు.