News April 13, 2025

SKLM: ‘కోర్టు విధుల్లో సిబ్బంది ప్రతిభ చూపాలి’

image

కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కోర్టు విధుల్లో ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు ప్రతిభ కనబర్చాలని జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి కోర్టు లైజనింగ్ అధికారులకు సూచించారు. శనివారం కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ శాఖలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర చాలా కీలకమని ఎస్పీ అన్నారు. వివిధ దశల్లో ఎదురవుతున్న సమస్యలను ఎస్పీకి సిబ్బంది వివరించారు.

Similar News

News April 15, 2025

గార : పోరుబందరు పోర్ట్‌లో మత్యకారుడు అదృశ్యం

image

గార మండలం మోగదాలపాడుకు చెందిన మత్స్యకారుడు పుక్కళ్ల సిద్ధార్థ (సర్దార్) (44) చేపలు వేట కోసం గుజరాత్‌లోని పోరుబందరు వెళ్లి అదృశ్యమయ్యారు. ఏప్రిల్ 8వ తేదీన వేట పూర్తైన తరువాత రూమ్‌కి రాలేదని బోట్ డ్రైవర్ గురుమూర్తి మంగళవారం తెలిపారు. అప్పటి నుంచి వెతికామని ఆయన కానరాలేదన్నారు. సిద్ధార్థకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News April 15, 2025

కోటబొమ్మాళిలో వ్యక్తి ఆత్మహత్య

image

కోటబొమ్మాళి గ్రామంలోని విద్యుత్ నగర్‌లో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. మృతుడు బ్రాహ్మణతర్ల గ్రామానికి చెందిన కోరాడ వాసుగా గుర్తించామన్నారు. SBI వెనుక ఉన్న మామిడి చెట్టుకు ఉరివేసుకొని ఉరివేసుకున్నాడని అందిన సమాచారంతో పరిశీలించామన్నారు. దీనిపై కేసు నమోదు చేశామని, మృతికి కారణాలు తెలయాల్సి ఉందని తెలిపారు.

News April 15, 2025

ఎచ్చెర్ల: డిగ్రీ స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ విడుదల 

image

 డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలోని 2015, 2016, 2017,2018, 2019 ఎడ్మిట్ డిగ్రీ విద్యార్థులకు 2,4,6 సెమిస్టర్ పరీక్షలకు స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్‌ను నేడు యూనివర్సిటీ డీన్ జి.పద్మారావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ పరీక్షలు జూన్ 10వ తేదీ నుంచి జరుగుతాయని, పరీక్ష ఫీజు మే 17వ తేదీ లోపు చెల్లించవచ్చని తెలిపారు.

error: Content is protected !!