News April 13, 2025

అనకాపల్లి: 14న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 14న  రద్దు చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం  ఓ ప్రకటనలో తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రజా వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Similar News

News March 15, 2026

విజయవాడలో ధరల సెగ.. కేజీ చికెన్ ఎంతంటే!

image

ఆదివారం సెలవు దినం కావడంతో విజయవాడలో మాంసం మార్కెట్లు కళకళలాడుతున్నాయి. అయితే ధరలు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్ స్కిన్‌లెస్ కిలో రూ. 340 పలుకుతుండగా, మటన్ రూ. 900 వద్ద కొనసాగుతోంది. చేపలు, గుడ్ల ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. ప్రాంతాలను బట్టి స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 15, 2026

వరంగల్: కొత్త మోసాలు.. ప్రజలకు పోలీసుల ALERT

image

ఫోన్ కాల్స్ ద్వారా “డిజిటల్ అరెస్ట్” చేస్తామంటూ బెదిరించే ముఠాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వరంగల్ పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు, రిటైర్డ్ వ్యక్తులే లక్ష్యంగా ఈ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. చట్టంలో “డిజిటల్ అరెస్ట్” అనే పదమే లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా బెదిరించి డబ్బులు అడిగితే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

News March 15, 2026

వరంగల్: ‘డ్రగ్స్‌కు దూరంగా ఉండండి’

image

యువత మత్తుకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని వరంగల్ పోలీసులు సూచించారు. ‘Say No to Drugs’ ప్రచారంలో భాగంగా అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే 1908 లేదా 8712671111 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు స్పష్టం చేశారు.