News April 13, 2025

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన గిరిపుత్రిక

image

అల్లూరి జిల్లా పీఎం కోట గ్రామానికి చెందిన కదల నారాయణరెడ్డి, వెంకట లక్ష్మి కుమార్తె హరిచందన ఇంటర్ ఫలితాల్లో 981 మార్కులతో జిల్లాలోనే ఉన్నత స్థానంలో నిలిచింది. వై రామవరంలోని పి. ఎర్రగొండ ఏపీఆర్ కాలేజీ నుంచి ఈ ప్రతిభ కనబరిచింది. గత పదవ తరగతి ఫలితాల్లో కూడా జిల్లాలో టాప్‌లో ఉండడం గమనార్హం. తమ కష్టం ఎంతోమంది గిరిజనులకి ప్రేరణ నిస్తుందని, బంధువులు, గ్రామస్థులు, ఏజెన్సీ వాసులు అభినందనలు తెలిపారు.

Similar News

News April 4, 2026

నేలకోట నుంచి పూడిపల్లికి.. పులి సంచారంతో భయం భయం!

image

నాలుగు రోజులుగా నేలకోట, పెదకొండేపూడిలో మకాం వేసిన పులి శనివారం మళ్లీ పూడిపల్లి చేరింది. గంగవరం, రంపచోడవరం కొండల మీదుగా వచ్చిన దారిలోనే వెనక్కి వెళుతోందని ఏలూరు రేంజ్ అటవీ అధికారి తెలిపారు. గతంలో అమర్చిన ట్రాకింగ్ పరికరం ద్వారా దీని కదలికలను గమనిస్తున్న రెస్క్యూ బృందాలు పోశమ్మగండి మీదుగా పూడిపల్లి చేరుకున్నాయి. పులి సంచారంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News April 4, 2026

భర్తతో గొడవ.. గోదావరిలోకి దూకేద్దామని..!

image

భర్తతో గొడవపడి గోదావరిలో దూకేందుకు ప్రయత్నించిన ఒక మహిళను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు కాపాడారు. శుక్రవారం రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద గోదావరిలో దూకడానికి ప్రయత్నించిన మహిళను శక్తి టీం పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే.. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలానికి చెందిన ఈ మహిళ భర్తతో గొడవపడి చనిపోవడానికి వచ్చింది. ఆమె కదలికలను గమనించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు చెప్పగా వారు వచ్చి రక్షించారు.

News April 4, 2026

పులిని బంధించేందుకు నెలకోట చేరిన మహారాష్ట్ర బృందం

image

పోలవరం(D) నేలకోట కొండ వద్ద మకాం వేసిన పులిని బంధించేందుకు మహారాష్ట్ర నుంచి 12 మంది సభ్యుల బృందాన్ని శుక్రవారం ఏలూరు, రంపచోడవరం, రాజమహేంద్రవరం అటవీశాఖ అధికారులతో కలిసి నేలకోట, గండికోట మధ్యలో బృందం మాటువేసింది. పెదకొండేపూడిలో గోశాల వద్ద మరో బృందాన్ని ఉంచారు. ఈ రాత్రికి పులిని బంధించడం లేదా రిజర్వు ఫారెస్టు వైపు పులిని దారి మళ్లించేలా ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ అధికారి తెలిపారు.