News April 13, 2025
ములుగు జిల్లాలో మళ్లీ పులి సంచారం..!

తాడ్వాయి, ఏటూరునాగారం సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏటూరునాగారం, పస్రా అటవీ శాఖ రేంజ్ అధికారులు హెచ్చరించారు. ఏటూరునాగారం వన్యప్రాణి డివిజన్ పరిధిలోని అడవిలో పులి సంచరిస్తున్న సమాచారం మేరకు వాటి అడుగుజాడల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. మహదేవపూర్, మేడారం సరిహద్దుల్లో ఓ పశువును పులి చంపిందన్న సమాచారం మేరకు బయ్యక్కపేట, ఐలాపూర్ ప్రాంతాల్లో పులి కదలికలపై ఆరాతీస్తున్నామన్నారు.
Similar News
News September 18, 2025
ఎటపాక: స్కూ డ్రైవర్ బిట్‌ను మింగేసిన బాలుడు

ఎటపాకలోని చోడవరానికి చెందిన గౌతమ్ (8) బుధవారం ఆడుకుంటూ స్క్రూ డ్రైవర్‌ను మింగేశాడు. తీవ్రమైన కడుపునొప్పితో అల్లాడుతుండగా కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. అది పేగులో అడ్డం తిరగడంతో భద్రాచలం ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేసి బిట్‌ను బయటకు తీశారు. దీంతో బాలుడు సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డాడు.
News September 18, 2025
HYD: దుర్గామాత మండపాలకు అనుమతి తప్పనిసరి

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నిర్వాహకులు మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వెబ్‌సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో నమోదు చేయాలన్నారు.
News September 18, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డబుల్ బిల్లులు..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డబుల్ బిల్లులు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు రూ. లక్ష చొప్పున వారి ఖాతాల్లో జమ అయిన నాలుగు రోజుల తర్వాత తిరిగి అదే మొత్తాన్ని మరోసారి జమ చేశారు. ఈ విషయం గమనించిన గృహనిర్మాణ శాఖ అధికారులు డబుల్ బిల్లులు పొందిన లబ్ధిదారుల నుంచి డబ్బును రికవరీ చేసి, ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయాలని స్థానిక ఏఈ, ఎంపీడీవోలను ఆదేశించారు.