News April 13, 2025
మెదక్: ఆసుపత్రుల్లో తాగు నీటిని ఉంచాలి: మంత్రి

అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు, ఆసుపత్రి సిబ్బందికి తాగు నీరు అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాగు నీటి సౌకర్యం, వడ దెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లపై మంత్రి విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News September 17, 2025
జగిత్యాల: రూ.300 అద్దె కోసం దారుణ హత్య

రూ.300 కోసం హత్య చేసిన ఘటన జగిత్యాల రూరల్ మండలం పొలాస-గుల్లపేట సమీపంలో చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ నహిముద్దీన్‌ను అద్దె విషయంలో బీహర్‌కు చెందిన దర్శన్ సాహ్ని, సునీల్ సాహ్ని అనే కూలీలు దారుణంగా హతమార్చారు. ఆటో అద్దె విషయంలో వాగ్వాదం పెరగడంతో గుడ్డతో మెడకు ఉరి వేసి, బండతో మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ రఘు చందర్ వెల్లడించారు.
News September 17, 2025
సంగారెడ్డి: ఇంటర్ ప్రవేశాలకు నేడే చివరి అవకాశం

పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరేందుకు నేడే చివరి అవకాశమని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశాలకు సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉందని ఆయన చెప్పారు. జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గడువులోగా ప్రవేశం పొందకపోతే ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు.
News September 17, 2025
ఒక్క మండలంలోనే 3 వేల బోగస్ పట్టాలు.. ‘భరోసా’ బంద్

TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘భూ భారతి’ పైలట్ ప్రాజెక్టు సర్వేతో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నల్గొండ(D) తిరుమలగిరి(M)లో 3 వేల బోగస్ పట్టాలను అధికారులు గుర్తించి రద్దు చేశారు. ఆయా భూములకు సంబంధించిన అక్రమ లబ్ధిదారులకు రైతు బీమా, రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాలను నిలిపేశారు. దీనిపై సమీక్షించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అర్హులైన 4 వేల మందికి త్వరలో కొత్త పట్టాలిస్తామని ప్రకటించారు.