News April 13, 2025

విశాఖ: స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

విశాఖ జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ 2025-26 ఆర్ధిక సంవత్సరంకు ఎస్.సి.నిరుద్యోగ యువతకు 16.88 కోట్ల రూపాయలతో వివిధ స్వయం ఉపాధి పథకాలను అమలు చేయడానికి ఆమోదం తెలిపిందని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ శనివారం తెలిపారు. https://apobmms.apcfss.in లో ఏప్రిల్ 14నుంచి మే 10లోపు బిపిఎల్ కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.  పూర్తి వివరాలకు వెబ్సైట్‌లో చూడాలని అన్నారు.

Similar News

News April 15, 2025

పక్క పక్కనే షెడ్డులు ఉండటంతో ప్రాణనష్టం: అనకాపల్లి ఎస్పీ

image

కైలాసపట్నం బాణసంచా కేంద్రంలో క్రాకర్స్ తయారీకి కెమికల్స్‌ను గ్రైండర్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. కోటవురట్ల పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. రెండో నంబర్ షెడ్లలో పేలుడు జరిగి వ్యాపించిన మంటలు దగ్గరలో ఉన్న ఒకటో నంబర్ షెడ్‌కు వ్యాప్తి చెందినట్లు తెలిపారు. పక్క పక్కనే షెడ్‌లు ఉండటంవల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందన్నారు.

News April 15, 2025

సింహాచలం చందనోత్సంపై సమీక్షించనున్న మంత్రి 

image

దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం విశాఖ రానున్నారు. ఈరోజు రాత్రి 10:45కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని ఓ హోటల్‌లో బస చేస్తారు. బుధవారం సింహాచలం దేవాలయానికి వెళ్లి చందనోత్సవ పనులపై అధికారులతో కలిసి సమీక్ష చేస్తారు. సాయంత్రం సింహాచలం నుంచి విశాఖ ఎయిర్పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.

News April 15, 2025

దువ్వాడ: రైలులో ప్రసవించిన మహిళ

image

చర్లపల్లి నుంచి కిసాన్ గంజ్ (07046) రైల్లులో ప్రయాణిస్తున్న మహిళ ఆదివారం అర్ధరాత్రి 12:30కు దువ్వాడ సమీపంలో ప్రసవించింది. రైలులో ఉన్న జైనాబ్‌కు పురిటి నొప్పులు రావడంతో రైల్వే సిబ్బంది గమనించి సత్వర చర్యలు చేపట్టారు. ఆమె రైలులోనే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తక్షణమే తర్వాత స్టేషన్లో హాస్పిటల్‌కి తరలించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు.

error: Content is protected !!