News April 13, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 7, 2026

354కి చేరిన AQ.. HYDలో జర భద్రం

image

HYDలో ఎయిర్ క్వాలిటీ మరొకసారి తారస్థాయికి చేరింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతూ వస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్‌క్వాలిటీ బుధవారం బడంగ్‌పేట్‌లో తెల్లవారుజామున 354కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటీస్, డస్ట్ అలర్జీ ఉన్నవారితో పాటు సామాన్యులు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గతవారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ ఇవాళ భారీగా పెరిగింది.

News January 7, 2026

నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 143 పాయింట్ల నష్టంతో 84,920 వద్ద.. నిఫ్టీ 56 పాయింట్లు క్షీణించి 26,122 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో టైటాన్, ఇన్ఫీ, HCL, టెక్ మహీంద్రా, ఎటర్నల్ షేర్లు లాభాల్లో.. TMPV, HDFC, ఎయిర్‌టెల్, మారుతీ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.

News January 7, 2026

కవిత-BRSకు ఎక్కడ చెడింది?

image

TG: BRSతో కవిత పూర్తిగా <<18785218>>సంబంధాలు<<>> తెంచుకోవడానికి దారితీసిన అంశాలపై చర్చ జరుగుతోంది. కష్టకాలంలో పార్టీ అండగా లేదని కవిత తీవ్రస్థాయిలో విమర్శించారు. అయితే లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ సమయంలో KTR, హరీశ్ అధికారులను అడ్డుకోవడం, బెయిల్ కోసం కృషి చేయడం గుర్తులేవా అని BRS శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇక KTR-కవిత మధ్య ఆస్తుల గొడవ కారణంగానే ఆమె బయటికి వచ్చారని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి. మీరేమంటారు?