News April 13, 2025
Orange: HYDలో సరిపోయింది ఈ శనివారం

ఈ శనివారం HYD వాసులకు గుర్తుండిపోయే రోజు. వీర హనుమాన్ విజయయాత్ర జరిగిన నగరంలోనే ఆరెంజ్ ఆర్మీ జైత్ర యాత్ర కొనసాగింది. ఉదయం నుంచి ఓ ఆర్మీ జై శ్రీరామ్ నినాదాలతో HYDను హోరెత్తించగా.. మరో ఆర్మీ ఉప్పల్ స్టేడియంలో చెలరేగిపోయింది. ఎటు చూసినా కాషాయజెండాలే దర్శనమిచ్చాయి. భక్తుల పూజలు, హనుమంతుడి అనుగ్రహంతో ఆరెంజ్ ఆర్మీ ఘన విజయం సాధించిందని హైదరాబాద్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News April 15, 2025
హైదరాబాద్ శివారులో చిరుతలు?

నగర శివారులోని ఇక్రిశాట్ క్యాంపస్‌లో సోమవారం సిబ్బందికి రెండు చిరుతల ఆనవాళ్లు కనిపించాయి. దీంతో సిబ్బంది వాటిని ఫొటో తీశారు. అయితే అవి నిజంగా చిరుతలా? లేక పెద్ద పిల్లులా? అని తేలాల్సి ఉందని ఇక్రిశాట్ అధికారులు తెలిపారు. అటవీ అధికారులను సంప్రదించి నిర్ధారిస్తామని పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఇక్రిశాట్ కమ్యూనికేషన్ హెడ్ తాహిర తెలిపారు.
News April 15, 2025
సికింద్రాబాద్‌లో 6 ప్లాట్‌ఫామ్స్ CLOSE.. చర్లపల్లి నుంచి సేవలు

సికింద్రాబాద్ స్టేషన్‌లో 100 రోజులు 6 ప్లాట్‌ఫామ్‌లు మూసివేస్తారు. రైళ్లను చర్లపల్లికి మళ్లిస్తున్నారు.
ట్రైయిన్‌ల వివరాలు:
APR26:సికింద్రాబాద్-దానపూర్, హైదరాబాద్-రక్సేల్
APR28:దనాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-అగర్తల
APR29:రక్సేల్-సికింద్రాబాద్, ముజఫర్పూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-సంత్రాగచి
APR30:సంత్రాగచి-సికింద్రాబాద్
MAY1:సికింద్రాబాద్-ముజర్ఫూర్
MAY2: అగర్తల-సికింద్రాబాద్
SHARE IT
News April 15, 2025
HYDలో భారీగా పెరిగిన చికెన్ ధరలు

HYDలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత వారం KG చికెన్ రూ. 200లోపు అమ్మారు. మంగళవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హోల్ సేల్ దుకాణాల్లో విత్ స్కిన్ KG రూ.213, స్కిన్ లెస్ KG రూ.243గా నిర్ణయించారు. రిటైల్ షాపుల్లో రూ.220 నుంచి రూ.250 మధ్యన అమ్ముతున్నారు. ఇటీవల బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గిరాకీ లేక తీవ్రంగా నష్టాలు చవిచూశామని చికెన్ వ్యాపారులు తెలిపారు. ఇక డిమాండ్‌కు తగ్గట్లు ధరలు నిర్ణయించే అవకాశం ఉంది.