News April 13, 2025

శుభ ముహూర్తం (13-04-2025)(ఆదివారం)

image

తిథి: బహుళ పాడ్యమి పూర్తి.. నక్షత్రం: చిత్త రా.7.40 వరకు తదుపరి స్వాతి.. శుభసమయం: ఉ.8.25 నుంచి 9.01 వరకు తిరిగి మ.2.50 నుంచి 3.02.. రాహుకాలం: సా.4.30-6.00 వరకు.. యమగండం: మ.12.00-మ.1.30 వరకు దుర్ముహూర్తం: సా.4.25-ఉ.5.13 వరకు వర్జ్యం: రా.1.52-తె.3.38 వరకు అమృత ఘడియలు: ఉ.12.35 నుంచి 2.21 వరకు

Similar News

News April 14, 2025

ఉద్యోగులకు డా.రెడ్డీస్ షాక్?

image

ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ ఉద్యోగులకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖర్చులను తగ్గించుకునేందుకు 25% ఎంప్లాయీస్‌ను తొలగిస్తోందని ‘బిజినెస్ స్టాండర్డ్స్’ తెలిపింది. వార్షిక వేతనం రూ.కోటికిపైన ఉన్నవారిని రాజీనామా చేయాలని, 50-55 ఏళ్ల పైన ఉన్న సీనియర్ ఎంప్లాయీస్‌ని VRS తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొంది. మేజర్‌గా R&D ఉద్యోగులపైనే ఫోకస్ చేసినట్లు సమాచారం. దీనిపై సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

News April 14, 2025

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’

image

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ దక్కించుకుంది. ట్రైలర్ గ్రిప్పింగ్‌గా ఉండటం, చాలాకాలం తర్వాత విజయశాంతి ఫైట్లు చేయడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. 144 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీ ఈ నెల 18న విడుదల కానుంది. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేయగా అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

News April 14, 2025

రోహిత్‌కు క్రెడిట్ కట్టబెట్టడం కరెక్ట్ కాదు: మంజ్రేకర్

image

నిన్న రాత్రి DCపై ముంబై సాధించిన విజయం వెనుక గొప్పదనాన్ని రోహిత్‌కు కట్టబెట్టడం సరికాదని మాజీ క్రికెటర్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ సలహాలు ఇచ్చారు కరెక్టే. కానీ ఎవరు ఎన్ని చెప్పినా దాన్ని మైదానంలో అమలు చేయాల్సింది కెప్టెనే. క్రెడిట్ అంతా రోహిత్‌కు ఇవ్వడం అస్సలు కరెక్ట్ కాదు. ఒకవేళ ఏదైనా తేడా జరిగి మ్యాచ్‌ను ముంబై చేజార్చుకుని ఉంటే అందరూ హార్దిక్‌నే తిట్టి ఉండేవారు’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!